Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదులో శివలింగానికి పూజలు.. 21న సుప్రీంకోర్టులో విచారణ

కాశీ విశ్వనాథ్ టెంపుల్-జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి ఈ నెల 21న ఈ విచారణ జరగనుంది. గత మే నెలలో జ్ఞానవాపి మసీదులో శివలింగంలాంటి ఒక ఆకృతిని అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఆకృతిని అక్కడ ఫౌంటేన్‌గా వినియోగిస్తున్నారు.

Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదులో శివలింగానికి పూజలు.. 21న సుప్రీంకోర్టులో విచారణ

Gyanvapi Masjid

Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదులో గుర్తించిన శివలింగానికి పూజలు నిర్వహించే అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. కాశీ విశ్వనాథ్ టెంపుల్-జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి ఈ నెల 21న ఈ విచారణ జరగనుంది. గత మే నెలలో జ్ఞానవాపి మసీదులో శివలింగంలాంటి ఒక ఆకృతిని అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే.

Supreme Court: ఆ నిధులు ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలకు బదిలీ చేయండి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

ఈ ఆకృతిని అక్కడ ఫౌంటేన్‌గా వినియోగిస్తున్నారు. అయితే, ఇది శివలింగమే అని హిందూ సంఘాలు నమ్ముతున్నాయి. దీంతో శ్రావణ మాసం సందర్భంగా అక్కడి శివలింగానికి పూజలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశంపై సత్వర విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనాన్ని పిటిషనర్లు కోరారు. దీనికి అంగీకరించిన కోర్టు ఈ నెల 21న విచారణ జరుపుతామని చెప్పింది. కొంతకాలంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. దీనిపై ఆర్కియాలజీ విభాగం సర్వే చేసి ఒక నివేదిక ఇచ్చింది.

Vijayendra Prasad: రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన విజయేంద్ర ప్రసాద్

ఈ నివేదిక ప్రకారం మసీదు లోపల శివలింగం వంటి ఆకృతి ఉంది. దీంతో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకోవాలని అప్పట్లో వారణాసి కోర్టు సూచించింది. ఇరు వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణ జరగకుండా చూసింది. తాజాగా మసీదులోపలి శివలింగానికి పూజలు నిర్వహించుకుంటామని హిందూ సంఘాలు కోరుతుంటే, అది శివలింగం కాదని.. ఒక ఫౌంటేన్ మాత్రమే అని మసీదు కమిటీ చెబుతోంది.