DJ – Duvvada Jagannadham : దుమ్ము దులుపుతున్న ‘దువ్వాడ జగన్నాథమ్’..

‘DJ - దువ్వాడ జగన్నాథమ్’ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో ఏకంగా 350 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది..

DJ – Duvvada Jagannadham : దుమ్ము దులుపుతున్న ‘దువ్వాడ జగన్నాథమ్’..

Duvvada Jagannadham

Updated On : May 25, 2021 / 6:29 PM IST

DJ – Duvvada Jagannadham: స్టైలిష్ స్టార్, యూత్ ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు.. బన్నీ, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన సూపర్ హిట్ మూవీ ‘DJ – దువ్వాడ జగన్నాథమ్’..

2017 జూన్ 23న రిలీజ్ అయిన ఈ ఫిలిం అల్లు అర్జున్, హరీష్ శంకర్లకు మంచి పేరు తెచ్చిపెట్టింది.. రాక్ స్టార్ డిఎస్పీ సాంగ్స్‌కి బన్నీ వేసిన డ్యాన్స్ సినిమాకే హైలెట్ అయింది.. సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘రాధే’ లో ‘సీటీ మార్’ సాంగ్ రీమిక్స్ చెయ్యడంతో పాటు కొన్ని మూమెంట్స్ కూడా వాడారు..

Seeti Maar : వావ్.. సల్మాన్ ‘సీటీ మార్’.. బన్నీ, డీఎస్పీలకు థ్యాంక్స్ చెప్పిన భాయ్ జాన్.. ప్రేయసితో పాడించాడుగా!

తాజాగా ‘DJ – దువ్వాడ జగన్నాథమ్’ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో ఏకంగా 350 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులతో సందడి చేస్తున్నారు..