Gold seized : ఫేస్ క్రీమ్ డబ్బాలో అరకిలో బంగారం తరలింపు..సీజ్ చేసిన అధికారులు

ఫేస్ క్రీమ్ డబ్బాలో పెట్టి అరకిలో బంగారం తీసుకొచ్చిన ప్రమాణీకుడిని అధికారులు అరెస్ట్ చేశారు. అతనినుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

Gold Seized

528 Grams gold seized in shamshabad airport : అంతర్జాతీయ విమానాయాల్లో బంగారాలు, వజ్రాలు, గంజాయిల తరలింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. అధికారులు ఎంతగా నిఘా పెట్టినా వీటి తరలింపులు జరుగుతునే ఉన్నాయి. ఈక్రమంలో హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయమంలో ఓ ప్రయాణీకుడి నుంచి అధికారులు అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు దొరకుడదనే ఉద్ధేశంతో సదరు ప్రయాణీకుడు పెద్ద తెలివితేటలు ఉపయోగించారు. ఓ ఫేస్ క్రీమ్ బాక్సులో అరకిలో బంగారాన్ని అమర్చాడు. దీంతో అతనిపై అనుమానం వచ్చిన కష్టమ్స్ అధికారులు తనఖీలు నిర్వహించగా అడ్డంగా దొరికిపోయాడు.

Read more : Shocking : తోటలో పనిచేసే కూలీపై పడిన అరటిపండ్లు..4 కోట్ల పరిహారం చెల్లించి యజమాని..!

దోహా నుంచి శంషాబాద్ కు వచ్చిన ఓ ప్రయాణీకుడు అక్రమంగా తీసుకువచ్చిన 528 గ్రాముల బంగారాన్ని కష్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా సదరు ప్రయాణీకుడు ఓ ఫేస్ క్రీమ్ డబ్బాలో ఈ బంగారాన్ని దాచి తీసుకువచ్చాడని అధికారులు తెలిపారు. ఈ బంగారం విలువ రూ.20.44 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందుతుడిని అరెస్ట్ చేశామని దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.

Read more : Crocodile In Musi : మూసీ నదిలో మొసలి కలకలం