Crocodile In Musi : మూసీ నదిలో మొసలి కలకలం

అత్తాపూర్ వద్ద మొసలి ప్రత్యేక్షం కావడంతో స్థానికులు జూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మొసలి కోసం గాలిస్తున్నారు.

Crocodile In Musi : మూసీ నదిలో మొసలి కలకలం

Crocodile In Musi

Crocodile In Musi : నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు పోటెత్తింది. వరద ఉదృతి అధికంగా ఉండటంతో జంట జలాశయాల గేట్లు ఎత్తి వరద నీటిని మూసీలోకి విడుదల చేశారు. ఇక వరద నీటిలో మొసలి కనిపించింది. అత్తాపూర్ వద్ద మొసలి ప్రత్యేక్షం కావడంతో స్థానికులు జూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మొసలి కోసం గాలిస్తున్నారు.

Read More : Heavy Rains in Kadapa: కడప జిల్లాలో భారీ వర్షాలు

అయితే మూసీలో మొసలి కనిపించడం ఇది మొదటి సారి కాదు.. మూసీకి వరదలు వచ్చిన ప్రతి సారి ఎక్కడో ఓ చోట మొసళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి. గతేడాది పురాణాపూల్, రాజేంద్రనగర్ సమీపంలో మొసలి కనిపించింది. అప్పుడు కూడా స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు గాలింపు చేపట్టినా అవి దొరకలేదు. ఇక తాజాగా అత్తాపూర్ లో మొసలి కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More : Heavy Rains in Hyderabad: ఇంకా ముంపులోనే హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు

ఇదిలా ఉంటే ఈ రోజు కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులు అందుబాటులో ఉంటారని, ఏదైనా సమస్య వస్తే వెంటనే సంప్రదించాలని తెలిపారు.