Police Chase Smugglers: విశాఖ జిల్లా పొలాల్లో దొంగా.. పోలీసు ఛేజింగ్ సీన్!
పోలీసులు తలచుకుంటే ఏ నేరస్థుడికైనా శిక్ష పడేలా చేయగలరు.. ఎంతటి క్లిష్టమైన కేసును కూడా ఛేదించి నిందితులను న్యాయస్థానం ముందు నిలబెట్టగలరు.

Police Chase Smugglers
Police Chase Smugglers: పోలీసులు తలచుకుంటే ఏ నేరస్థుడికైనా శిక్ష పడేలా చేయగలరు.. ఎంతటి క్లిష్టమైన కేసును కూడా ఛేదించి నిందితులను న్యాయస్థానం ముందు నిలబెట్టగలరు. కానీ.. రాజకీయ నాయకులూ.. అధికార పార్టీలు, సమాజంలో పలుకుబడి కలిగిన కొందరు వీరిని ప్రభావితం చేయడంతోనే వాళ్ళ అధికారాలు పరిమితం చేసుకుంటుంటారని ఒక ప్రచారం ఉంటుంది. అదే పోలీసులకు ఫ్రీడమ్ ఇస్తే సమాజంలో ఎలాంటి వాడైనా తప్పు చేయాలంటే వణుకు పుట్టేలా చేయగలరు.
అలాంటిది.. వారి ఉద్యోగాలకే ఎసరు వస్తే ఊరికే ఉండగలరా.. నేరస్థులను పంట పొలాలలో వెంబడించి మరీ పట్టుకున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేసి పారిపోతున్న నిందితులను పోలీసులు ప్రాణాలకు తెగించి ఛేజ్ చేసి పట్టుకొని మరీ లోపలేశారు. అచ్చంగా సినీ ఫక్కీలో జరిగిన ఈ ఛేజింగ్ విశాఖ జిల్లా సబ్బవరం పోలీసు స్టేషన్ పరిధిలోని తవ్వవానిపాలెం వద్ద జరిగింది. ఇద్దరు గంజాయి స్మగ్లర్లు పోలీస్ స్టేషన్ నుండే పరారు కావడంతో పోలీసులు వారిని ఛేజ్ చేసి పట్టుకున్నారు.

Police Chase Smugglers
శనివారం ఉదయం మామిడి పండ్లు మాటున గంజాయి తరలిస్తుండగా సబ్బవరం పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. అప్పటి నుండి వారిని విచారిస్తున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు కూడా హాజరు పరచనున్నారు. అయితే.. ఆ ఇద్దరూ కన్నుగప్పి స్టేషన్ నుండే పరారయ్యేందుకు ప్రయత్నించారు. అనుకున్నట్లుగానే స్టేషన్ నుండి తవ్వవానిపాలెం పంట పొలాల వైపుగా పరిగెత్తారు. పోలీసులు కూడా వారి వెంట ఛేజింగ్ కు దిగారు. పొలాల్లోని రైతులు కూడా పోలీసులకు సహకరించడంతో మొత్తానికి నిందితులను పట్టుకొని మళ్ళీ స్టేషన్లో పెట్టారు.