Australian woman : 5 రోజులు అడవిలో చిక్కుకుపోయిన మహిళ .. వైన్, స్వీట్స్‌తో బతికి బయటపడింది..

ఎటు చూసినా దట్టమైన అడవి. కారు ప్రమాదంలో చిక్కుకుంది. బయటకు వెళ్లలేని పరిస్థితి. 5 రోజుల పాటు భయంకరమైన పరిస్థితుల్ని ఎదుర్కుని ప్రాణాలు దక్కించుకున్న ఆస్ట్రేలియన్ మహిళ స్టోరి చదవండి.

Australian woman

Australian woman :  ఓ మహిళ దట్టమైన అడవిలో ప్రయాణిస్తోంది. అక్కడ జరిగిన ప్రమాదంలో కారు మట్టిలో కూరుకుపోయింది. అంతే ఎటూ కదలలేని పరిస్థితుల్లో అడవిలో చిక్కుకుపోయింది. అయితే ప్రాణాలతో ఎలా బయటపడింది?

Turkiye Earthquake: భూకంప శిథిలాల కింద చిక్కుకున్న యువతి.. ఎలా బయటపడిందో చూడండి.. వీడియో వైరల్

ఆస్ట్రేలియాకు చెందిన లిలియన్ ఐప్ అనే మహిళ విక్టోరియా రాష్ట్రంలోని దట్టమైన అడవిలో ప్రయాణిస్తోంది. ఒక పొద వైపు ప్రయాణిస్తున్న ఆమె డెడ్ ఎండ్ ను ఢీ కొట్టింది. అంతే కారు మట్టిలో కూరుకుపోయింది. ఆమె ముందుకు కదలలేకపోయింది. ఆరోగ్య సమస్యలతో ఆమె అడుగులు వేయలేకపోయింది. లిలియన్ ఐఫ్ తన కారుతో ఉండాలని డిసైడ్ అయ్యింది. అందులో ఉన్న వైన్ బాటిల్ , కొన్ని స్నాక్స్, స్వీట్స్ 5 రోజులు ఆమె ప్రాణాలు కాపాడాయి. అయతే తాగడానికి నీరు మాత్రం దొరకలేదు. పోలీసులు ఆమెను కనుగొనే వరకు భయంకరమైన ఐదురాత్రులు గడిపింది.

iPhone 14 Crash Detection : ఐఫోన్ 14లో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అలర్ట్.. ప్రమాదంలో చిక్కుకున్న మహిళను కాపాడిన ఐఫోన్..!

అయితే లిలియన్ జీవితం మీద ఆశ వదులుకుందట. ఇక తాను చనిపోబోతున్నానని అనుకుందట. తన ఫ్యామిలీకి లెటర్ కూడా రాసిందట. అయితే ఆమెను తన ఊరికి 60 కిలోమీటర్ల దూరంలో పోలీసులు గుర్తించారు. మొత్తానికి లిలియన్ ప్రాణాలు దక్కాయి. డీహైడ్రేషన్ కారణంగా ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోందట.