Turkiye Earthquake: భూకంప శిథిలాల కింద చిక్కుకున్న యువతి.. ఎలా బయటపడిందో చూడండి.. వీడియో వైరల్

టర్కీలో ప్రస్తుతం వేలాదిమంది స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బ్రతికి ఉన్నవారిని రక్షించడంతోపాటు, మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,800 మందికిపైగా మరణించగా, 5 వేల మందికిపైగా గాయపడ్డారు. తాజా సహాయక చర్యల్లో భాగంగా శిథిలాల కింద చిక్కుకున్న ఒక యువతిని రక్షించారు.

Turkiye Earthquake: భూకంప శిథిలాల కింద చిక్కుకున్న యువతి.. ఎలా బయటపడిందో చూడండి.. వీడియో వైరల్

Updated On : February 6, 2023 / 9:38 PM IST

Turkiye Earthquake: టర్కీ (తుర్కియె), సిరియాలో సోమవారం ఉదయం సంభవించిన భూకంపం కనీవినీ ఎరుగని విషాదాన్ని మిగిల్చింది. వేల సంఖ్యలో భవనాలు నేల మట్టంకాగా, ఇప్పటివరకు 1,800 మందికిపైగా మరణించారు. ఇంత భారీ భూకంపం సంభవించిన 12 గంటల్లోపే మళ్లీ కొన్ని చోట్ల భూకంపం సంభవించింది.

Turkey Earthquake: తుర్కియె, సిరియాల్లో 1,300కు చేరిన భూకంప మృతుల సంఖ్య.. సహాయక బృందాల్ని పంపనున్న భారత్

సోమవారం సాయంత్రంలోపు పలుచోట్ల అనేకసార్లు భూకంపం నమోదైంది. ఈ సారి కూడా పలు ఇండ్లు, భవనాలు నేలకూలాయి. అయితే, ప్రజలు భూకంపం నేపథ్యంలో భవనాల్లో ఉండేందుకు భయపడుతున్నారు. దీంతో తాజా భూకంపంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, ఉదయం వచ్చిన భూకంపం ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. కూలిపోయిన శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు భద్రతా దళాలు, సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. టర్కీలో ప్రస్తుతం వేలాదిమంది స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బ్రతికి ఉన్నవారిని రక్షించడంతోపాటు, మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,800 మందికిపైగా మరణించగా, 5 వేల మందికిపైగా గాయపడ్డారు.

Supreme Court Judges: సుప్రీం జడ్జీలుగా మరో ఐదుగురు ప్రమాణ స్వీకారం.. 32కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య

తాజా సహాయక చర్యల్లో భాగంగా శిథిలాల కింద చిక్కుకున్న ఒక యువతిని రక్షించారు. ప్రమాదం జరిగిన గంటల తర్వాత ఆ యువతి స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. వెంటనే సహాయక బృందాలు ఆమెను ఆస్పత్రికి తరలించాయి. ఈ అమ్మాయి క్షేమంగా బయటపడ్డ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు టర్కీ, సిరియాలకు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. అన్ని రకాలుగా సాయం అందిస్తామని పలు దేశాలు ప్రకటించాయి.