Supreme Court Judges: సుప్రీం జడ్జీలుగా మరో ఐదుగురు ప్రమాణ స్వీకారం.. 32కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య

జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా నూతన జడ్జీలుగా ప్రమాణం చేశారు. ఐదుగురు నూతన జడ్జీల చేరికతో సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య 27 నుంచి 32కు పెరిగింది.

Supreme Court Judges: సుప్రీం జడ్జీలుగా మరో ఐదుగురు ప్రమాణ స్వీకారం.. 32కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య

Supreme Court Judges: కొత్తగా ఎంపికైన ఐదుగురు న్యాయమూర్తులు సుప్రీం కోర్టు జడ్జీలుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో వీరితో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Turkey Earthquake: తుర్కియె, సిరియాల్లో 1,300కు చేరిన భూకంప మృతుల సంఖ్య.. సహాయక బృందాల్ని పంపనున్న భారత్

జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా నూతన జడ్జీలుగా ప్రమాణం చేశారు. ఐదుగురు నూతన జడ్జీల చేరికతో సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య 27 నుంచి 32కు పెరిగింది. సుప్రీం న్యాయమూర్తుల బెంచ్‌లో ఇంకో రెండు స్థానాలు మాత్రమే ఖాళీ ఉన్నాయి. గత డిసెంబర్ 13న ఈ ఐదుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వీటికి తాజాగా కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ నెల 4న ఐదుగురిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జడ్జీల నియామకానికి సంబంధించి కొంతకాలంగా ప్రభుత్వం, సుప్రీం కొలీజియం మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.

China Spy Balloon: చైనా బెలూన్ కూల్చేసిన అమెరికా.. అగ్రరాజ్యాన్ని హెచ్చరించిన చైనా

సుప్రీంకోర్టు జడ్జీలతోపాటు, 25 హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో వివాదం మొదలైంది. సుప్రీంకోర్టు కొలీజియం రాజ్యాంగానికి వ్యతిరేకంగా తయారైందని మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వివాదం కొలిక్కిరావడంతోపాటు, ఈ అంశంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించడంతో న్యాయమూర్తుల నియామక ప్రక్రియ ముందుకుసాగింది. మిగిలిన ఇద్దరు న్యాయమూర్తుల నియామకం కూడా త్వరలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపై సుప్రీం కొలీజియం ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.