China Spy Balloon: చైనా బెలూన్ కూల్చేసిన అమెరికా.. అగ్రరాజ్యాన్ని హెచ్చరించిన చైనా

శనివారం సాయంత్రం అట్లాంటిక్ సముద్ర తీరంలో బెలూన్‌ను అమెరికా ఎఫ్-22 విమానం నుంచి మిస్సైల్ ప్రయోగించి పేల్చివేసింది. అయితే, అమెరికా చర్యపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో అమెరికాపై తగిన విధంగా స్పందిస్తామని చైనా హెచ్చరించింది.

China Spy Balloon: చైనా బెలూన్ కూల్చేసిన అమెరికా.. అగ్రరాజ్యాన్ని హెచ్చరించిన చైనా

China Spy Balloon: అమెరికా గగనతలంలోకి దూసుకొచ్చిన చైనా బెలూన్‌ను అమెరికా పేల్చివేసింది. శనివారం సాయంత్రం అట్లాంటిక్ సముద్ర తీరంలో బెలూన్‌ను అమెరికా ఎఫ్-22 విమానం నుంచి మిస్సైల్ ప్రయోగించి పేల్చివేసింది. అయితే, అమెరికా చర్యపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Turkey Earthquake: తుర్కియె, సిరియాల్లో 1,300కు చేరిన భూకంప మృతుల సంఖ్య.. సహాయక బృందాల్ని పంపనున్న భారత్

ఈ విషయంలో అమెరికాపై తగిన విధంగా స్పందిస్తామని చైనా హెచ్చరించింది. చైనా నిఘా బెలూన్‌గా భావిస్తున్న ఈ బెలూన్ ఉత్తర అమెరికా గగనతలంలో చాలా రోజులు ఎగిరింది. అనంతరం అమెరికా గగనతలంలోకి దూసుకొచ్చింది. దక్షిణ కరోలినా తీరంలో ఉన్న ఈ బెలూన్‌ను అమెరికా పేల్చివేసింది. దీన్ని చైనా తప్పుబట్టింది. అమెరికా చర్య తమ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడమేనని, దీన్ని అంగీకరించలేమని చైనా వ్యాఖ్యానించింది. ఈ అంశంలో తగిన విధంగా స్పందిస్తామని చైనా హెచ్చరించింది. అయితే, బెలూన్ కూల్చివేతను అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం సమర్ధించుకుంది. అమెరికా రక్షణశాఖ సెక్రెటరీ లాయిడ్ ఆస్టిన్ ఈ చర్యను సమర్ధించారు.

Delhi Mayor Poll: మూడోసారి వాయిదాపడ్డ ఢిల్లీ మేయర్ ఎన్నిక.. సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఆప్

బెలూన్ కూల్చివేత చర్య చట్టబద్ధమైనదిగా లాయిడ్ అభివర్ణించారు. ఈ ఘటనపై చైనా విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన చేసింది. ‘‘సాధారణ పౌర అవసరాల కోసం వినియోగించే వాయు నౌక (బెలూన్)ను అమెరికా కూల్చివేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. దీని ద్వారా అమెరికా అతిగా స్పందించింది’’ అని చైనా విమర్శించింది. అమెరికా పౌరులకు ఎలాంటి ముప్పు కలగకూడదనే ఆ బెలూన్ పేల్చివేసినట్లు ఆ దేశ రక్షణశాఖ అధికారులు తెలిపారు. ఈ బెలూన్ కూల్చివేతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

మరోవైపు అమెరికా కూడా చైనా చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చైనాకు చెందిన నిఘా విమానాలు అనేకం అమెరికా గగనతలంలో ఎగురుతున్నట్లు యూఎస్ అధికారులు తెలిపారు. అసలే అమెరికా-చైనాల మధ్య ఉన్న శతృత్వాన్ని తాజా చర్య మరింత పెంచింది.