Belgian Girl Married Karnataka Boy: నిజాయితీ మెచ్చి మనువాడింది.. కర్ణాటక ఆటోవాలాను పెళ్లిచేసుకున్న బెల్జియం యువతి

ప్రేమకు భాష అడ్డుకాదు, దేశాల సరిహద్దులు అడ్డురావు.. సంస్కృతులు, సాంప్రదాయాలు వేరైనా రెండు మనస్సులు కలిశాయంటే వారి ఏడడుగుల బంధానికి ముందడుగు పడినట్లే. ఇలాంటి తరహా వివాహం కర్ణాటక రాష్ట్రం విజయనగరంలో జరిగింది. బెల్జియం అమ్మాయి, కర్ణాటకకు చెందిన అబ్బాయి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Belgian Girl Married Karnataka Boy: ప్రేమకు భాష అడ్డుకాదు, దేశాల సరిహద్దులు అడ్డురావు.. సంస్కృతులు, సాంప్రదాయాలు వేరైనా రెండు మనస్సులు కలిశాయంటే వారి ఏడడుగుల బంధానికి ముందడుగు పడినట్లే. ఇలాంటి తరహా వివాహం కర్ణాటక రాష్ట్రం విజయనగరంలో జరిగింది. బెల్జియం అమ్మాయి, కర్ణాటకకు చెందిన అబ్బాయి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పూర్తివివరాల్లోకి వెళితే.. బెల్జియం అమ్మాయి విజయనగరానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత యువతి 7,374 కిలోమీటర్లు ప్రయాణించి ప్రముఖ హంపి ఆలయంలో వివాహం చేసుకుంది. ఈ జంట భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి పేరు కెమిల్లీ, యువకుడి పేరు అనంతరాజు.

Also: 19 Weds 30 Love Marriage : అబ్బాయికి 19.. అమ్మాయికి 30.. గచ్చిబౌలిలో కలకలం రేపిన ప్రేమ పెళ్లి

దాదాపు నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమబంధం కొనసాగుతోంది. అనంతరాజు హంపిలో ఆటో డ్రైవర్‌గా, గైడ్‌గా పనిచేస్తున్నాడు. బెల్జియంకు చెందిన కెమిల్ సామాజిక కార్యకర్త. ఇద్దరూ హంపిలోనే కలుసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల క్రితం కెమిలి తన కుటుంబంతో కలిసి టూర్‌కి హంపికి వచ్చింది. ఈ సమయంలో అనంతరాజు వారికి గైడ్‌గా పనిచేశాడు. అనంతరాజు నిజాయితీని కెమిలీ కుటుంబానికి బాగా నచ్చింది. అనంతరాజు ఎక్కడా మోసం చేయకుండా ప్రయాణికులతో, విదేశీయులతో వ్యవహరించిన తీరు, నాజాయితీ కెమిలిని ప్రేమలో పడేలా చేసింది. దీనికితోడు అనంతరాజుకు వచ్చే సంపాదనలో కొంత పేదలకు దానం చేస్తుండటాన్నిచూసి కెమిలి మరింత ఇష్టపడింది. ఈ విషయాన్ని తొలుత వారి తల్లిదండ్రులకు తెలిపింది. కానీ, వారు తొలుత ససేమీరా అన్నప్పటికీ ఆ తరువాత ఒప్పుకున్నారు.

Man Marries Dead Girlfriend : ప్రియురాలి మృతదేహానికి తాళి కట్టి .. జీవితంలో పెళ్లి చేసుకోనని శపథం చేసిన ప్రేమికుడు

తల్లిదండ్రుల సంమక్షంలోనే అనంతరాజుకు తన ప్రేమవిషయాన్ని తెలిపింది. ఇరు కుటుంబాలు మధ్య సమ్మతంమేరకు బెల్జియంలో ఘనంగా వివాహం జరిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో కరోనా రావడంతో కెమిలి బెల్జియంలో, అనంతరాజు ఇండియాలోనే ఉండిపోయారు. రెండేళ్లుగా దూరంగా ఉన్నప్పటికీ వీరిమధ్య బంధం మరింత బలపడింది. ఇటీవలి కాలంలో కెమిలికి వారి కుటుంబ సభ్యులు వివాహం చేయాలని భావించారు. కెమిలి అందుకుససేమీరా అనడంతో పాటు అనంతరాజునే వివాహం చేసుకుంటానని పట్టుబట్టింది. దీంతో వారి కుటుంబ సభ్యులు వారి ప్రేమముందు తలవంచక తప్పలేదు. దీంతో భారత్ లోనే పెళ్లి బాజాలు మోగాయి. శుక్రవారం హంపీ విరూపాక్షేశ్వర ఆలయంలో హంపీ చెందిన అంజీనప్ప కుమారుడు అనంతరాజుకు, బెల్జియంకు చెందిన జీప్ పిలిఫ్ మూడవ కుమార్తె కెమిలి ఇరువురి కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఒక్కటయ్యారు. వీరి వివాహాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు.

 

ట్రెండింగ్ వార్తలు