19 Weds 30 Love Marriage : అబ్బాయికి 19.. అమ్మాయికి 30.. గచ్చిబౌలిలో కలకలం రేపిన ప్రేమ పెళ్లి

ఆ అబ్బాయి పేరు అలెక్స్. వయసు 19ఏళ్లు. ఆ యువతి పేరు జ్యోతి. వయసు 30ఏళ్లు. వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అంతే.. ఒక్కసాగి దుమారం రేగింది. వీరి ప్రేమ పెళ్లి వ్యవహారం వివాదానికి దారితీసింది.

19 Weds 30 Love Marriage : అబ్బాయికి 19.. అమ్మాయికి 30.. గచ్చిబౌలిలో కలకలం రేపిన ప్రేమ పెళ్లి
ad

19 Weds 30 Love Marriage : ఆ అబ్బాయి పేరు అలెక్స్. వయసు 19ఏళ్లు. ఆ యువతి పేరు జ్యోతి. వయసు 30ఏళ్లు. వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అంతే.. ఒక్కసాగి దుమారం రేగింది. వీరి ప్రేమ పెళ్లి వ్యవహారం వివాదానికి దారితీసింది.

సాధారణంగా ప్రేమ పెళ్లి లాంటి వ్యవహారాల్లో అమ్మాయి తరఫు వారే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు. ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. అబ్బాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తమ అబ్బాయికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారని అబ్బాయి పేరెంట్స్ కేసు పెట్టారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరినీ పిలిపించి మాట్లాడారు. అయితే వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు పంపించేశారు.

Naina Jaiswal Facing Harassment : టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌కు సోషల్‌మీడియాలో వేధింపులు

దీంతో అబ్బాయి తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. తమ అబ్బాయిని తమకు అప్పగించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ట్రాప్ చేసి తమ కుమారుడిని కిడ్నాప్ చేశారంటున్న అలెక్స్ పేరెంట్స్ వాపోయారు.

”నా సోదరుడు అలెక్స్ కి 19ఏళ్లు. మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. మేము నివాసం ఉంటున్న కాలనీలోనే ఓ బట్టల షాపులో సేల్స్ గర్స్ గా జ్యోతి పని చేస్తుంది. అలెక్స్ మంచి టాలెంటెడ్. రెండేళ్లుగా సివిల్ సర్వీసెస్ కు కూడా ప్రిపేర్ అవుతున్నాడు. అలాంటి అలెక్స్ ను జ్యోతి ఎప్పుడు, ఎలా ట్రాప్ చేసిందో తెలీదు. జ్యోతి పని చేసే షాప్ దగ్గర అలెక్స్ ఉంటున్నాడని, అలెక్స్ తో మాట్లాడుతోందని అలెక్స్ ఫ్రెండ్స్ చెప్పారు. దీంతో నేను జ్యోతితో మాట్లాడాను. అక్కా ఇది కరెక్ట్ కాదని చెప్పా. అయినా జ్యోతి వినలేదు” అని అలెక్స్ సోదరుడు వాపోయాడు.

Karnataka: కలిసుండడానికి ఒప్పకుని, కోర్టులోనే భార్య గొంతు కోసిన భర్త

”మా కొడుకుని కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాము. మా కొడుకుని పోలీసులు మాకు అప్పగించాల్సింది. నా కొడుకు అలెక్స్ ను ట్రాప్ చేశారు. కిడ్నాప్ చేశారు. మేము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. వారిద్దరూ మేజర్లు అని విడిచిపెట్టేశారు. మా కొడుకు అలెక్స్ చాలా భయపడుతూ మాట్లాడుతున్నాడు. ఏ మాత్రం సంతోషంగా లేడు. మా అబ్బాయి చేతులకు గాయాలు కూడా ఉన్నాయి. ఎక్కడికి వెళ్లాలన్నా మాకు చెప్పే వెళ్లేవాడు. మా పర్మిషన్ తీసుకునే వెళ్లేవాడు. ఇంటికి వస్తానని చెప్పాడు. కానీ పోలీసులు మా అబ్బాయిని తమతో తీసుకెళ్లారు. అక్కడి నుంచి పంపేశారు. మా అబ్బాయిని ఎక్కడికి పంపారో కూడా తెలీదు. మా అబ్బాయి పరిస్థితి ఏంటో కూడా తెలియదు. ఏమైపోయాడో తెలీదు. మా అబ్బాయి క్షేమంగా మా దగ్గరికి వస్తే చాలు” అని అలెక్స్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw