Karnataka: కలిసుండడానికి ఒప్పకుని, కోర్టులోనే భార్య గొంతు కోసిన భర్త

నిందితుడి పేరు శివకుమార్. భార్య చిత్రం. వీరికి ఏడేళ్ల క్రితం పెళ్లైంది. అయితే కొంత కాలంగా వీరి మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. ఇక ఎంత మాత్రం కలిసుండాల్సిన అవసరం లేదని, ఇరువురు కలిసి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. విడిపోవాలనుకున్న వారికి నచ్చజెప్పి కలపడం భారత సంప్రదాయం. కోర్టులో కూడా వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి కలిసుండేందుకు ఒప్పించారు

Karnataka: కలిసుండడానికి ఒప్పకుని, కోర్టులోనే భార్య గొంతు కోసిన భర్త

Man slits wife throat at court after decision to reunite

Karnataka: గొడవలు, మనస్పర్థలు భార్యాభర్తల మధ్య సహజం. ఒక్కోసారి ఇవి గోరంత నుంచి కొండంతకు వెళ్లి దారుణాలకు దారి తీస్తుంటాయి. పోలీసులు, కోర్టుల జోక్యంతో భార్యాభర్తల మధ్య ఉండే విబేధాలు కొంత వరకు తగ్గొచ్చు కానీ, పూర్తి స్థాయిలో వాటిని తగ్గించలేం. కోర్టు వరకు వచ్చి కూడా విడిపోయిన జంటలెన్నో. కోర్టు తీర్పుల అనంతరం జరిగిన దారుణాలెన్నో. తాజాగా కోర్టులోనే తన భార్య గొంతు కోసి హతమార్చాడు ఓ వ్యక్తి. అది కూడా తాము కలిసుండడానికి ఒప్పుకున్న అనంతరం జరిగిన దారుణం ఇది.

కర్ణాటకలోని హస్సన్ జిల్లాలో ఉన్న ఫ్యామిలీ కోర్టులో జరిగింది. నిందితుడి పేరు శివకుమార్. భార్య చిత్రం. వీరికి ఏడేళ్ల క్రితం పెళ్లైంది. అయితే కొంత కాలంగా వీరి మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. ఇక ఎంత మాత్రం కలిసుండాల్సిన అవసరం లేదని, ఇరువురు కలిసి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. విడిపోవాలనుకున్న వారికి నచ్చజెప్పి కలపడం భారత సంప్రదాయం. కోర్టులో ఇదే జరిగింది. ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి కలిసుండేందుకు ఒప్పించారు. అయితే బయటికి ఒప్పుకున్నట్టే కనిపించిన శివకుమార్.. అసలు స్వరూపం కాసేపైతే కానీ తెలియలేదు.

చిత్ర వాష్ రూంకి వెళ్తుండగా ఆమె వెనకాలే వెళ్లి కొడవలితో ఆమె గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులకు చిక్కాడు. రక్తపు మడుగులో ఉన్న చిత్రను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయమై హస్సన్ జిల్లా పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ ‘‘కోర్టు పరిధిలోనే ఈ దారుణం జరిగింది. నిందితుడు మా కస్టడీలోనే ఉన్నాడు. దాడికి ఉపయోగించిన కొడవలిని సీజ్ చేశాం. ఈ కేసుపై తదుపరి విచారణ చేస్తున్నాం’’ అని తెలిపారు.

JK Rowling: సల్మాన్ రష్దీ తర్వాత నువ్వే.. ‘హ్యారీపోటర్’ రచయిత్రికి హెచ్చరికలు