JK Rowling: సల్మాన్ రష్దీ తర్వాత నువ్వే.. ‘హ్యారీపోటర్’ రచయిత్రికి హెచ్చరికలు

సల్మాన్ రష్దీపై దాడి జరగక ముందే మరో రచయిత్రిని చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇరాన్‌కు చెందిన ఒక తీవ్రవాద సంస్థ సానుభూతిపరుడు ఒక ట్వీట్ రిప్లై ద్వారా జేకే రౌలింగ్‌ను హెచ్చరించాడు.

JK Rowling: సల్మాన్ రష్దీ తర్వాత నువ్వే.. ‘హ్యారీపోటర్’ రచయిత్రికి హెచ్చరికలు

JK Rowling: రచయిత సల్మాన్ రష్దీపై దాడి ఘటన మరువక ముందే మరో రచయిత్రిని చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. ‘హ్యారీపోటర్’ రచయిత్రి జేకే రౌలింగ్‌ను చంపేస్తామంటూ ఇరాన్‌కు చెందిన ఒక తీవ్రవాద సంస్థకు చెందిన సభ్యుడు ప్రకటించాడు. రెండు రోజుల క్రితం సల్మాన్ రష్దీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.

Rakesh Jhunjhunwala: వివాదాస్పదమైన మోదీ, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భేటీ.. కారణమేంటో తెలుసా!

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రష్దీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సల్మాన్ రష్దీపై దాడి ఘటనపై జేకే రౌలింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ వార్త దిగ్భ్రాంతి కలిగించిందని, ఆయన బాగానే ఉంటారని ఆశిస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొంది. దీనికి మీర్ అసిఫ్ అజీజ్ అనే నెటిజన్ రిప్లై ఇచ్చాడు. ‘బాధ పడకండి.. తర్వాత మీరే’ అంటూ ట్వీట్ రిప్లై ఇచ్చాడు. పరోక్షంగా ఆమెను కూడా చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశాడు. అతడు ఇరాన్ తీవ్రవాద సంస్థకు చెందిన సానుభూతి పరుడిగా తెలుస్తోంది. మీర్ అసిఫ్ అంతకుముందు కూడా సల్మాన్ రష్దీపై దాడిని సమర్ధిస్తూ ట్వీట్ చేశాడు. దాడికి పాల్పడ్డ నిందితుడి పేరు హదీ మటార్ అని, అతడు ఇరాన్‌కు చెందిన అయతొల్లా జారీ చేసిన ఫత్వాను అనుసరించిన విప్లవకారుడు అని ట్వీట్ చేశాడు.

Salman Rushdie: సల్మాన్ రష్దీకి వెంటిలేటర్ తొలగింపు.. నిందితుడిని ప్రశంసించిన ఇరాన్ మీడియా

ఈ ట్వీట్లను బట్టి అతడు తీవ్రవాద భావాలున్న వ్యక్తిగా తెలుస్తోంది. జేకే రౌలింగ్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారని, తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జేకే రౌలింగ్ మరో ట్వీట్ చేసింది. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.