Man Marries Dead Girlfriend : ప్రియురాలి మృతదేహానికి తాళి కట్టి .. జీవితంలో పెళ్లి చేసుకోనని శపథం చేసిన ప్రేమికుడు

ప్రియురాలి మృతదేహానికి తాళి కట్టి .. జీవితంలో పెళ్లి చేసుకోనని శపథం చేశారు ఓ ప్రేమికుడు.

Man Marries Dead Girlfriend : ప్రియురాలి మృతదేహానికి తాళి కట్టి .. జీవితంలో పెళ్లి చేసుకోనని శపథం చేసిన ప్రేమికుడు

Man Marries Dead Girlfriend

Updated On : May 20, 2023 / 10:36 AM IST

Man Marries Dead Girlfriend  : ప్రేమించకపోతే యాసిడ్ పోస్తాం..పెళ్లికి అంగీకరించపోతే చంపేస్తాం అనే ఉన్మాదులు ఉన్న ఈ సమాజంలో ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చే ప్రేమికులు కూడా ఉన్నారని..దూరమైన ప్రియురాలి కోసం తాను ఇంక ఎప్పటికీ పెళ్లి చేసుకోనని శపథం చేసిన గొప్ప ప్రేమికుడు కూడా ఉన్నాడని నిరూపించాడు ఓ యువకుడు. ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు అర్థాంతరంగా చనిపోవడాన్ని భరించలేని ఆ యువకుడు తల్లిడిల్లిపోయాడు. తన జీవితమే శూన్యమైపోయిందని నువ్వు లేని నేను నీ జ్ఞాపకాలతోనే బతికేస్తానని ఇక నా జీవితంలో పెళ్లి అనే మాటే ఉండదని శపథం చేశాడు. నీతో జీవితం పంచుకోవాలనే నా కలలు కల్లలైపోయాయని ఏడ్చాడు. ఇక జీవితంలో పెళ్లి చేసుకోనని నువ్వు చనిపోయినా నువ్వే ఎప్పటికీ నా భార్యగా ఉండిపోతావని ప్రియురాలి మతదేహానికే తాళి కట్టాడు. ఇక నేను జీవితంలో పెళ్లి చేసుకోనని శపథం చేశాడు. ఆమెకు కడసారి ఆమెకు వీడ్కోలు పలికి గుండెలవిసేలా రోదించాడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తున్న ఈ ఘటన అసోంలో చోటు చేసుకుంది.

అసోంలోని మోరిగావ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల బిటుపన్ తములి, కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రతనా బోరా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని సంతోషంగా గడపాలని ఎన్నెన్నో కలలు కన్నారు. కానీ అనుకున్నవన్నీ జరిగితే ఇంకేముంది? వారి కలలు అన్నీ కల్లలైపోయాయి. అనారోగ్యంతో ప్రతన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ శుక్రవారం (నవంబర్ 18,2022) ప్రాణాలు వదిలింది. అంతే తములి గుండె పగిలిపోయింది.

ఆమె ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించాడు. కోలుకుని ఇంటికి వస్తుందనుకున్న ప్రేయసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తట్టుకోలేకపోయాడు. ఈ జన్మకు నువ్వు నా భార్యవు అంటూ ప్రియురాలి మతదేహానికి కుటుంబ సభ్యుల ముందే తాళి కట్టాడు. నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టి, మెడలో దండ వేశాడు. ఇక జీవితంలో తాను ఎవ్వరినీ పెళ్లి చేసుకోనని, మిగిలిన జీవితాన్ని ప్రేయసితో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ ఒంటరిగానే ఉంటానని శపథం చేశాడు. బిటుపన్‌ మనోవేదనను చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు.