NTR: కంచరపాలెం పాటకే తారక్ పట్టం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ ఫిక్షన్....

Aasha Paasham Is The Most Played Song On Ntr Phone

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ ఫిక్షన్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన అంచనాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ దూసుకుపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ నిర్వహించగా హీరోలు తారక్, చరణ్‌లతో పాటు దర్శకుడు రాజమౌళి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అంతేగాక పలు భాషల్లోని మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు.

NTR : రాజమౌళి కాకుండా వేరే డైరెక్టర్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ చేయను

ఈ క్రమంలో తారక్ ఓ ఇంట్వ్యూలో తనకు ఇష్టమైన పాట ఏమిటో బహిర్గతం చేశాడు. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, తన ఫోన్‌లో ఎక్కువసార్లు ప్లే అయిన పాట ఏమిటో తారక్ చెప్పుకొచ్చాడు. తెలుగులో దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రంలోని ‘ఆశ పాశం..’ అనే పాట తన ఫోన్’లో ఎక్కువ సార్లు విన్న పాటగా తారక్ చెప్పాడు. 2018లో రిలీజ్ అయిన ఈ చిత్రంలోని ఈ పాటను సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించగా, స్వీకర్ అగస్తి సంగీతం అందించారు.

Jr NTR: తారక్ కారు ఆపి సోదాలు నిర్వహించిన జూబ్లీహిల్స్ పోలీసులు!

ఈ పాటను ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుందని తారక్ చెప్పుకురావడం విశేషం. ఇక ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు వెంకటేష్ మహా తారక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన చిత్రంలోని పాటను ఇంతగా అభిమానించే తారక్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ పాట గురించి తారక్ లాంటి స్టార్ హీరో చెప్పుకురావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తారక్ ఈ సినిమాతో భారీ సక్సెస్‌ను అందుకోవాలని వెంకటేష్ మహా ఈ సందర్భంగా కోరారు.

RRR: అక్కడ ఆర్ఆర్ఆర్ బ్యాన్ చేయాలని డిమాండ్..?

కాగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవ్గన్, సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.