Abbas : హాస్పటల్‌లో ఒకప్పటి స్టార్ హీరో.. సర్జరీ ముందు భయమేసింది అంటూ పోస్ట్..

ప్రేమదేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అబ్బాస్. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో హీరోగా చాలా సినిమాలు ఆఫర్స్ వచ్చాయి అబ్బాస్ కి. తెలుగు, తమిళ్ లో...........

Abbas : హాస్పటల్‌లో ఒకప్పటి స్టార్ హీరో.. సర్జరీ ముందు భయమేసింది అంటూ పోస్ట్..

Abbas was admitted to the hospital for surgery

Updated On : November 22, 2022 / 7:18 AM IST

Abbas :  ప్రేమదేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అబ్బాస్. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో హీరోగా చాలా సినిమాలు ఆఫర్స్ వచ్చాయి అబ్బాస్ కి. తెలుగు, తమిళ్ లో చాలా సినిమాలు హీరోగా, సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. 2015లో చివరగా ఓ మలయాళ సినిమా చేసి సినిమాల నుంచి తప్పుకున్నాడు. అబ్బాస్ విదేశాలకి వెళ్లి అక్కడే సెటిల్ అయి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నట్టు సమాచారం.

విదేశాలకి వెళ్లినా, సినిమాలని వదిలేసినా అప్పుడప్పుడు తన ఫేస్ బుక్ పోస్టులతో ప్రేక్షకులని పలకరిస్తూనే ఉన్నాడు. తాజాగా అతడు ఓ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ ఫొటోను అబ్బాస్‌ తన ఫేస్ బుక్ లో షేర్ చేశాడు.

Last Film Show : ఆస్కార్ నామినేటెడ్ సినిమా.. ఓటీటీలోకి వచ్చేస్తుంది..

ఆ ఫోటోని షేర్ చేసి.. ”ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆందోళన పడ్డాను. కొంచెం భయం కూడా వేసింది. నా భయాలని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాను. నా మనస్సును ధృడంగా ఉంచుకోవడానికి చాలా ట్రై చేశాను. నాకు సర్జరీ జరిగింది. ప్రస్తుతం బాగానే ఉన్నాను. త్వరగా ఇంటికి రావాలి అనుకుంటున్నాను. మీ ప్రేమ, ప్రార్థనలు నాకు సపోర్ట్ గా ఉన్నాయి” అంటూ తెలిపాడు. అయితే ఏ సర్జరీ జరిగిందో చెప్పలేదు అబ్బాస్. అబ్బాస్ త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.