Raashi Khanna : ముద్దుగుమ్మలు.. మతి పోగొడుతున్నారు..

రాశీ ఖన్నా, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి, కోలీవుడ్ బ్యూటీ ఆత్మిక ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు..

Raashi Khanna : ముద్దుగుమ్మలు.. మతి పోగొడుతున్నారు..

Actress Aathmika Raashi Khanna And Lavanya Tripathi Photoshoot

Updated On : June 26, 2021 / 11:11 AM IST

Raashi Khanna: హైట్ తక్కువున్నా హొయలతో కుర్రకారుకి కిక్ ఇచ్చే రాశీ ఖన్నా, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి, కోలీవుడ్ బ్యూటీ ఆత్మిక ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఇప్పుడు మేమిలా ఉన్నాం అంటూ తమ కొత్త లుక్స్‌తో, అదిరిపోయే ఫోజులతో ఆకట్టుకుంటున్నారు.

ఆరెంజ్ టీ షర్ట్‌లో అందాలవిందు చేసిన రాశీ ఖన్నా.. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో యువసామ్రాట్ నాగ చైతన్యకు జంటగా ‘థ్యాంక్యూ’, మ్యాచో హీరో గోపిచంద్ – మారుతి కాంబోలో రానున్న ‘పక్కా కమర్షియల్’ సినిమాలు చేస్తుంది. ‘జిల్’, ‘ఆక్సిజన్’ తర్వాత గోపితో, ‘ప్రతిరోజు పండగే’ తర్వాత మారుతితో రాశీ చేస్తున్న సినిమా ఇది. వీటితోపాటు ఐదు తమిళ్, ఒక మలయాళం సినిమాలున్నాయి రాశీ చేతిలో.

ఈ ఏడాది ‘A 1 ఎక్స్‌ప్రెస్’, ‘చావు కబురు చల్లగా’ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన టాల్ బ్యూటీ లావణ్య త్రిపాఠి కూడా లేటెస్ట్ పిక్స్ వదిలింది. కూల్, సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌లో పాపను చూసి.. లావణ్యమా ఊరించకే అని యూత్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్య కొత్త సినిమాలేవీ అనౌన్స్ చెయ్యలేదు.

కోలీవుడ్ బ్యూటీ ఆత్మిక ఎప్పటికప్పుడు ఫొటోషూట్లతో ఫ్యాన్స్ అండ్ నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తుంటుంది. కోలీవుడ్ సినిమాలతో తమిళ తంబీలను అలరించిన ఆత్మిక.. తనలోని టాలెంట్‌ని గుర్తించమని, అవకాశాలు వస్తే ఇతర భాషల్లోనూ నటిస్తానని ఫోటోషూట్లతో మేకర్స్‌కి హింట్ ఇస్తోంది..