Agrajeetha : ‘అగ్రజీత’ ఆస్ట్రేలియాలో ప్రారంభమైంది.. సైన్స్ ఫిక్షన్ కథకు గ్రాఫిక్స్ హైలెట్ అంటున్న డైరెక్టర్..
రాహుల్ కృష్ణ, ప్రియాంక నోముల హీరో హీరోయిన్లుగా, సందీప్ రాజ్ దర్శకత్వంలో.. సందీప్ రాజ్ ఫిలిమ్స్ మరియు వాసవి త్రివేది ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అగ్రజీత’.. ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియా దేశంలో డాండెనాంగ్ సిటీలోని శివ విష్ణు ఆలయంలో ఘనంగా ప్రారంభించారు. ఈ ‘అగ్రజీత’ చిత్రాన్ని ఆద్యంతం ఆస్ట్రేలియాలోనే చిత్రీకరిస్తారు..

Agrajeetha
Agrajeetha: రాహుల్ కృష్ణ, ప్రియాంక నోముల హీరో హీరోయిన్లుగా, సందీప్ రాజ్ దర్శకత్వంలో.. సందీప్ రాజ్ ఫిలిమ్స్ మరియు వాసవి త్రివేది ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అగ్రజీత’.. ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియా దేశంలో డాండెనాంగ్ సిటీలోని శివ విష్ణు ఆలయంలో ఘనంగా ప్రారంభించారు. ఈ ‘అగ్రజీత’ చిత్రాన్ని ఆద్యంతం ఆస్ట్రేలియాలోనే చిత్రీకరిస్తారు.
ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘అగ్రజీత ఒక భిన్నమైన కథ. ఒక జీవి మరణం అనంతరం తన జ్ఞాపకాలను అణువు ద్వారా మరో జీవిలోకి వెళ్లే ఒక శాస్త్రీయ కథ. మంచి కథతో, మంచి గ్రాఫిక్ విలువలతో చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ చిత్రాన్ని మొత్తం ఆస్ట్రేలియా దేశంలోనే చిత్రీకరిస్తాం. రెగ్యులర్ షూటింగ్ మొదలైయింది’’.. అని తెలిపారు.
బ్యానర్ : సందీప్ రాజ్ ఫిలిమ్స్ మరియు వాసవి త్రివేది ప్రొడక్షన్స్..
నటీనటులు : రాహుల్ కృష్ణ, ప్రియాంక నోముల మరియు తదితరులు..
కెమెరా & ఎడిటింగ్ : సందీప్ రాజ్..
సంగీతం : సిద్ధార్థ్ వాట్కిన్స్..
కథ, కో డైరెక్టర్ : కృష్ణ రెడ్డి లోక..
స్క్రీన్‌ప్లే మరియు డైరెక్షన్ : సందీప్ రాజ్..