Aha-Tamil: తమిళ్లో ఎంట్రీ ఇచ్చిన ఆహా..!
తెలుగులో పక్కా లోకల్ బ్రాండ్‌తో తెలుగు సినిమాలను అందించే ఓటీటీ ప్లాట్‌ఫాంగా ‘ఆహా’ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. మొదలైన ఏడాదిలోనే ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంకు మిలియన్....
Aha-Tamil: తెలుగులో పక్కా లోకల్ బ్రాండ్‌తో తెలుగు సినిమాలను అందించే ఓటీటీ ప్లాట్‌ఫాంగా ‘ఆహా’ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. మొదలైన ఏడాదిలోనే ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంకు మిలియన్ సబ్స్క్రైబర్స్ చేరారంటే ఆహాకు తెలుగునాట ఎలాంటి ఆదరణ దక్కిందో అర్థం చేసుకోవచ్చు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ప్రముఖ ఓటీటీలకు పోటీగా నిలదొక్కుకోవడంలో సక్సెస్ అయిన ఆహా, తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు డబ్బింగ్ సినిమాలను కూడా స్ట్రీమింగ్ చేస్తూ వీక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది.
Aha Telugu Indian Idol: అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా కర్టెన్ రైజర్ కార్యక్రమం
అయితే తాజాగా ఆహా తమిళ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అచ్చ తమిళ్ కంటెంట్‌తో తమిళ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది ఆహా. ఇతర భాషల్లోనూ ఆహా సత్తా చాటాలని అల్లు అరవింద్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఇవాళ ఆహా తమిళ్ ఓటీటీని లాంఛనంగా ప్రారంభించారు నిర్వాహకులు. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్ చేతుల మీదుగా ఆహా తమిళ్ ఓటీటీని లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శింబు, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పాల్గొన్నారు. వారిద్దరు ఆహా తమిళ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఆహా తమిళ్ ఓటీటీ లాంఛ్ సందర్భంగా ‘తట్టిన తమిళ్ మట్టుమే’ అనే సినిమాను ప్రసారం చేశారు. కాగా పలువురు సినీ దిగ్గజాలకు, దివంగత సెలబ్రిటీలకు ఆహా యాజమాన్యం ‘కలైంజర్ హానర్’ పురస్కారాన్ని అందించింది. ఇక ఈ కార్యక్రమంలో కోలీవుడ్‌కు చెందిన పలువురు దర్శకులు, స్క్రీన్ రైటర్లు, నిర్మాతలతో సహా మరికొందరు ప్రముఖులు పాల్గొన్నారు. కాగా ఆహా తమిళ్ టీమ్‌ను అభినందిస్తూ.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ వీడియో బైట్ ద్వారా తన బెస్ట్ విషెస్‌ను తెలియజేశారు.