Ajay Devgan : గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌‌లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్..

సంతోష్‌ కుమార్‌తో కలిసి మొక్కలు నాటిన అజయ్‌ దేవ్‌గణ్‌.. అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు ఇచ్చారు..

Ajay Devgan : గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌‌లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్..

Updated On : June 10, 2021 / 3:59 PM IST

Ajay Devgan: రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విజయవంతంగా కొనసాగుతోంది. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాము మొక్కలు నాటడంతో పాటు మరికొందరిని నామినేట్‌ చేస్తూ.. అందరూ కలిసి విజయవంతంగా ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళుతున్నారు.

శుక్రవారం బాలీవుడ్ స్టార్‌ అజయ్‌ దేవ్‌గణ్‌ ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. సంతోష్‌ కుమార్‌తో కలిసి మొక్కలు నాటిన అజయ్‌ దేవ్‌గణ్‌.. అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు ఇచ్చారు.

Ajay Devgan

 

 

Ajay Devgan

ప్రస్తుతం అజయ్ దేవగణ్‌ దర్శక నిర్మాణంలో రూపొందుతోన్న‘మే డే’ మూవీ రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్ ఈ చిత్రంలో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ లో అజయ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

Ajay Devgan