‘మైదాన్’ లో ఆట మొదలయ్యేది అప్పుడే..

  • Published By: sekhar ,Published On : December 12, 2020 / 01:13 PM IST
‘మైదాన్’ లో ఆట మొదలయ్యేది అప్పుడే..

Updated On : December 12, 2020 / 4:31 PM IST

Ajay Devgn’s ‘Maidaan’: ఫుట్‌బాల్ నేపథ్యంలో యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మైదాన్’. ప్రియమణి కథానాయికగా నటిస్తోంది. గజ్‌రాజ్ రావ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

భారత దేశాన్ని ఫుట్‌బాల్ రంగంలో ప్రపంచ పటంలో నిలిపిన కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా.. జీవితంలో అయినా, ఆటలోనైనా ఆత్మ విశ్వాసం, కష్టపడే తత్వంతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే విజయం వరిస్తుంది అనే పాయింట్ హైలెట్‌గా స్ఫూర్తివంతమైన కథగా ‘మైదాన్’ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

Maidaan

‘బధాయి హో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. 2021 జనవరి కల్లా షూటింగ్ పూర్తవుతుంది..

వచ్చే ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ చేయనున్నాం.. అని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ‘మైదాన్’ విడుదల కానుంది.

Maidaan