Akhanda: రికార్డు స్థాయిలో అమ్ముడైన బాలయ్య-బోయపాటి కాంబినేషన్!

మన తెలుగు మాస్ హీరోలలో బాలకృష్ణ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సరైన దర్శకుడు తగిలితే బాలయ్య హీరోగా వచ్చిన సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేసిన రికార్డుల గురించి మనకి తెలిసిందే.

Akhanda: రికార్డు స్థాయిలో అమ్ముడైన బాలయ్య-బోయపాటి కాంబినేషన్!

Akhanda

Updated On : May 23, 2021 / 5:19 PM IST

Akhanda: మన తెలుగు మాస్ హీరోలలో బాలకృష్ణ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సరైన దర్శకుడు తగిలితే బాలయ్య హీరోగా వచ్చిన సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేసిన రికార్డుల గురించి మనకి తెలిసిందే. అలాంటిది సింహ, లెజెండ్ లాంటి రెండు భారీ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్లో దర్శకుడు బోయపాటితో వచ్చే సినిమా అనగానే ఆ సినిమా మీద అంచనాలు ఉండే రేంజే వేరు. అందుకు తగ్గట్లే ఇప్పటి వరకు అఖండ యూనిట్ కూడా పోస్టర్లు, టీజర్ ద్వారానే సినిమా మీద అంచనాలు పెంచేసింది.

బోయపాటి-బాలయ్య కాంబినేషన్ మీద ఉన్న అంచనాలు..టీజర్, పోస్టర్ల ద్వారా సినిమా మీద నెలకొన్న బజ్ కారణంగానే ఇప్పుడు అఖండ సినిమా బిజినెస్ కూడా ఊహించని విధంగా జరిగిందని తెలుస్తుంది. క్రేజీ కాంబినేషన్ కారణంగా ఓవరాల్ గా ఈ సినిమా భారీ స్థాయి బిజినెస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా థియేటర్, డిజిటల్ హక్కుల బిజినెస్ జరిగిపోగా అది భారీస్థాయిలో జరిగినట్లు తెలుస్తుంది.

అఖండ సినిమా మొత్తం థియేట్రికల్ మరియు డిజిటల్ హక్కులకు సంబంధించే 80 నుంచి 90 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టుగా టాక్ వినిపిస్తుంది. ఒకవిధంగా ఇది భారీ మార్కెట్ అనే చెప్పొచ్చు. క్రేజీ కాంబినేషన్ కనుక భారీ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంటుంది. అయితే.. ఇప్పుడు లేనిదల్లా సరైన సమయం. కరోనా దెబ్బకు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఎవరూ ఊహించని పరిస్థితి. కానీ క్రేజీ కాంబినేషన్ పరంగా అఖండ మంచి బిజినెస్ రాబట్టుకుంది. మరి.. అఖండ ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.