Akhil Akkineni: మెట్రో రైలులో ఏజెంట్.. ఎందుకో?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం ‘ఏజెంట్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి.....

Akhil Akkineni: మెట్రో రైలులో ఏజెంట్.. ఎందుకో?

Akhil Akkineni Spotted In Hyderabad Metro Rail For Agent Shoot

Updated On : March 26, 2022 / 3:16 PM IST

Akhil Akkineni: అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం ‘ఏజెంట్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. రీసెంట్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న అఖిల్, ఈసారి దాన్ని మించిన సాలిడ్ హిట్ అందుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

Akhil Akkineni: ‘ఏజెంట్’ రాకకు డేట్ ఫిక్స్!

ఈ క్రమంలోనే ఏజెంట్ చిత్రం కోసం చాలా కష్టపడుతున్నాడు ఈ హీరో. ఇప్పటికే ఈ సినిమా కోసం తన ఫిజిక్‌ను పూర్తిగా మూర్చుకున్నాడు అఖిల్. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది చిత్ర యూనిట్. అయితే తాజాగా హైదరాబాద్ మెట్రో రైలులో ప్రత్యక్షమయ్యాడు ఈ యంగ్ హీరో. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. మెట్రో రైలులో అఖిల్ ఏం చేస్తున్నాడని అందరూ ఆనుకున్నారు.

Akhil Akkineni : అయ్యగారి ఐరన్ బాడీ!

అయితే మెట్రో రైలులో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకే అఖిల్ అండ్ టీమ్ రైలు ఎక్కినట్లు తెలుస్తోంది. గతంలోనూ అఖిల్ నటించిన హలో చిత్రంలో మెట్రో రైలుకు సంబంధించిన సీన్స్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. మరి ఇప్పుడు ఏజెంట్ చిత్రంలో మెట్రో రైలుకు సంబంధించి ఎలాంటి సీన్స్ ఉంటాయా అని అభిమానులు ఎదరుచూస్తున్నారు. ఇక మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఏజెంట్ చిత్రాన్ని ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందించగా, హిప్‌హాప్ తమిళ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.