Akhil Akkineni: ‘ఏజెంట్’ రాకకు డేట్ ఫిక్స్!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Akhil Akkineni: ‘ఏజెంట్’ రాకకు డేట్ ఫిక్స్!

Akhil Agent

Akhil Akkineni: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈసారి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అఖిల్, ఏజెంట్ చిత్రంతో కెరీర్‌లోనే బెస్ట్ హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. ఇక ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఏజెంట్ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Akkineni Heroes: ఫుల్ బిజీ.. కెరీర్‌పై ఫోకస్ పెట్టిన అక్కినేని హీరోలు!

అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో ఏజెంట్ చిత్ర యూనిట్ సందడి చేస్తూ వచ్చింది. ఈ సినిమాలో అఖిల్ నయా లుక్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఏజెంట్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అప్పుడే అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. అయితే ఏజెంట్ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతున్నా, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే విషయంపై మాత్రం చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Agent: క్రేజీ అప్డేట్.. అఖిల్ ఏజెంట్ లో మలయాళ మెగాస్టార్!

కాగా అభిమానుల ఎదురుచూపులకు చిత్ర యూనిట్ తాజాగా సమాధానం ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కొద్ది నిమిషాల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఏజెంట్ చిత్రాన్ని ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో అఖిల్ తొలిసారి సిక్స్‌ప్యాక్ బాడీతో మనకు కనిపిస్తాడు. అఖిల్ నటన ఈ సినిమాలో హైలైట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాలో అఖిల్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకు హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తుండగా, స్టార్ రైటర్ వక్కంతం వంశీ కథను అందిస్తుండటం విశేషం. సాక్షి వైద్యా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని AK ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఏజెంట్ చిత్రంతోనైనా అఖిల్ కెరీర్‌లో అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకుంటాడో లేదో తెలియాలంటే ఆగస్టు 12 వరకు ఆగాల్సిందే.