Akkineni Heroes: ఫుల్ బిజీ.. కెరీర్‌పై ఫోకస్ పెట్టిన అక్కినేని హీరోలు!

తండ్రీ కొడుకుల సందడి మామూలుగా లేదు. ఏ హడావిడి లేకుండా బంగార్రాజుతో వచ్చి, సంక్రాంతి పండగని క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు ఇండివిజ్యువల్ సినిమాలపై ఫోకస్ పెట్టి, ఫుల్ బిజీ అయిపోయారు.

Akkineni Heroes: ఫుల్ బిజీ.. కెరీర్‌పై ఫోకస్ పెట్టిన అక్కినేని హీరోలు!

Akkineni Heroes

Akkineni Heroes: తండ్రీ కొడుకుల సందడి మామూలుగా లేదు. ఏ హడావిడి లేకుండా బంగార్రాజుతో వచ్చి, సంక్రాంతి పండగని క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు ఇండివిజ్యువల్ సినిమాలపై ఫోకస్ పెట్టి, ఫుల్ బిజీ అయిపోయారు. పాన్ ఇండియా లెక్కలేసుకోకుండా మినిమమ్ రేంజ్ బడ్జెట్ తోనే సినిమాలు చేసే అక్కినేని హీరోలు ఏ ఏ సినిమాలతో బిజీగా ఉన్నారో చూద్దాం.

Akkineni Heroes: బ్యాక్ టూ బ్యాక్ అక్కినేని సినిమాలు.. హ్యాపీ మూడ్‌లో ఫ్యాన్స్!

సైలెంట్ గా పనికానిచ్చేస్తున్నారు అక్కినేని హీరోలు. ఈ ఫ్యామిలీ ప్యాక్ తో మనం చేసిన విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో నాగచైతన్య బిజీ అయ్యాడు. థాంక్యూ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ధూత వెబ్ సిరీస్ పట్టాలెక్కించారు. ఫస్ట్ టైమ్ చైతూ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ధూతగా ఎంట్రీ ఇస్తున్నారు. హార్రర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ వెబ్ సిరీస్ మూడు సీజన్లలో ఉంటుందంటున్నారు. ఒక్కో సీజన్ లో 9 ఎపీసోడ్స్ చేయనున్నారు. ఆల్రెడీ రెండు సీజన్లకు సంబంధించిన స్క్రిప్ట్ లాక్ అయిపోయిందని సమాచారం.

Telugu Star Heroes: పాన్ ఇండియా రేంజ్.. బాలీవుడ్‌లో టాలీవుడ్ హీరోల క్రేజ్

బంగార్రాజు రిలీజ్ అయిన వెంటనే నాగార్జున.. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో బిజీ అయిపోయారు. వీళ్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ ది ఘోస్ట్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. ఫస్ట్ లుక్ తోనే ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా నాగ్ కెరీర్ లోనే బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కానుందంటున్నారు మేకర్స్. ప్రస్తుతం దుబాయ్ లో సోనాల్ చౌహాన్ తో నాగార్జున రొమాంటిక్ సీన్స్ షూట్ చేస్తున్నారు.

Akkineni Amala : మళ్ళీ సినిమాల్లోకి అమల.. ఒకేసారి తమిళ్, తెలుగులో రీఎంట్రీ

అక్కినేని ఫ్యామిలీ యంగెస్ట్ హీరో అఖిల్ కూడా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో స్పై థ్రిల్లర్ ఏజెంట్ సినిమాతో బిజీ అయిపోయాడు. కరణ్ జోహార్ నుంచి అఖిల్ కు బాలీవుడ్ పిలుపు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఇలా ముగ్గురు అక్కినేని హీరోలు ఎవరికి వారు వేరు వేరు థ్రిల్లర్ సినిమాలతో బిజీ అయ్యారు. అయితే వీళ్ల కాంబినేషన్ లో గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా వినిపించిన సబ్జెక్ట్ కూడా నాగ్ ఓకె చేసినట్టు వార్తలొచ్చాయి. సో అనుకున్నట్టు జరిగితే అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ కు ఇది బెస్ట్ ట్రీట్ అని చెప్పొచ్చు.