Akshay Kumar: తప్పు ఒప్పుకుని తప్పుకున్న స్టార్ హీరో!

స్టార్ హీరోలు సినిమాలతో పాటు యాడ్స్ రూపంలో కూడా తమ అభిమానులకు చేరవయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. అంతేగాక వారు తమ యాడ్స్ రూపంలో ప్రేక్షకులకు...

Akshay Kumar Steps Down As Tobacco Brand Ambasaddor

Akshay Kumar: స్టార్ హీరోలు సినిమాలతో పాటు యాడ్స్ రూపంలో కూడా తమ అభిమానులకు చేరవయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. అంతేగాక వారు తమ యాడ్స్ రూపంలో ప్రేక్షకులకు మెసేజ్‌లు కూడా ఇస్తుంటారు. అయితే కొందరు మాత్రం యాడ్ చేశామా.. డబ్బులు తీసుకున్నామా అనే రీతిలో వారు చేస్తున్న యాడ్స్ జనంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయని ఏమాత్రం ఆలోచించకుండా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది మద్యం, పొగాకు లాంటి ప్రోడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారి గురించే. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ విమల్ పాన్ పరాగ్ లాంటి ప్రోడక్టులను కూడా ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించేందుకే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాడు.

Akshay Kumar : అక్షయ్ కూడానా.. ఇలాంటి యాడ్స్ ఎందుకు అంటూ ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

అయితే అజయ్ దేవ్గన్ చేస్తున్న ఈ యాడ్‌పై జనంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఇప్పటికే అజయ్ దేవ్గన్ అభిమానులు కూడా ఈ యాడ్ పట్ల ఆయనపై మండిపడుతున్నారు. తాజాగా ఈ యాడ్‌లో మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా జాయిన్ అయ్యారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ప్రస్తుతం విమల్ పాన్ పరాగ్ యాడ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక రీసెంట్‌గా అక్షయ్ కుమార్ కూడా విమల్ పాన్ పరాగ్‌ను ప్రమోట్ చేస్తూ ఓ యాడ్‌లో నటించాడు. అయితే గతంలో ఆయన ఆరోగ్యానికి హానికరమైన ఎలాంటి ప్రోడక్టులను కూడా ప్రమోట్ చేయనంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు ఎలా విమల్ పాన్ పరాగ్ యాడ్ చేశావంటూ అక్షయ్ కుమార్‌ను నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.

Akshay Kumar : ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా అక్షయ్ కుమార్

నెట్టింట తనపై వ్యతిరేకత తీవ్రతరం అవుతుందని గమనించిన అక్షయ్ కుమార్, ఇప్పుడు దిద్దుబాటు చేసే పనిలో ఉన్నాడు. తాను నటించిన యాడ్ వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని.. ఇకపై వారికి ఇష్టంలేని ప్రోడక్టులకు ఎలాంటి ప్రమోషన్స్ చేయబోనని చెప్పుకొచ్చాడు. అంతేగాక వెంటనే విమల్ పాన్ పరాగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో అతడి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై కూడా అక్షయ్ కుమార్ ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదని వారు సూచిస్తున్నారు.