Akshay Kumar : అక్షయ్ కూడానా.. ఇలాంటి యాడ్స్ ఎందుకు అంటూ ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

తాజాగా ఓ కంపెనీ పాన్ మసాలా బ్రాండ్ ని బాలీవుడ్ స్టార్స్ అజయ్‌ దేవ్‌గణ్‌, అక్షయ్‌ కుమార్‌, షారుక్‌ ఖాన్‌ కలిసి ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ చేశారు. దీంతో విమల్ గ్యాంగ్ అంటూ నెటిజన్లు......

Akshay Kumar : అక్షయ్ కూడానా.. ఇలాంటి యాడ్స్ ఎందుకు అంటూ ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

Sharukh

 

Akshay Kumar :  బాలీవుడ్ స్టార్స్ లో అక్షయ్ కుమార్ చాలా ప్రత్యేకం. అక్కడ ఉండే స్టార్ల కంటే కూడా తన జీవనశైలి డిఫరెంట్ గా ఉంటుంది. ఇక తాను చూపించే దేశభక్తి, తాను చేసే సేవా కార్యక్రమాలు అక్షయ్ కి చాలా మంచిపేరుని తీసుకొచ్చాయి. అందరూ పిలిచే బాలీవుడ్ మాఫియా అనే బ్యాచ్ కి అక్షయ్ కొంచెం దూరంగానే ఉంటాడని చెప్పుకోవచ్చు. తన సినిమాలతో ప్రేక్షకులని, అభిమానులని మెప్పించడమే కాక దేశ భక్తి మిళితమై ఉన్న పనులు చేస్తూ దేశానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు.

మన సెలబ్రిటీలు, స్టార్లు డబ్బుల కోసం యాడ్స్ చేస్తారన్న సంగతి తెలిసిందే. అయితే చాలా మంది సెలబ్రిటీలు ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులకు ప్రమోట్ చేయడానికి దూరంగా ఉంటారు. కానీ బాలీవుడ్ వాళ్ళు అలాంటి యాడ్స్ కూడా చేయడానికి రెడీగా ఉంటారు. బాలీవుడ్ లో స్టార్ హీరోలు షారుక్, అజయ్ దేవగణ్, హృతిక్ లాంటి చాలా మంది హీరోలు పాన్ మసాలా యాడ్స్ ని చేశారు. ఆరోగ్యానికి హాని కలిగించే పాన్ మసాలా వంటి వాటిని ప్రమోట్ చేస్తూ వచ్చారు.

Samantha : సమంత ఫస్ట్ సంపాదన ఎంతో తెలుసా??

తాజాగా ఓ కంపెనీ పాన్ మసాలా బ్రాండ్ ని బాలీవుడ్ స్టార్స్ అజయ్‌ దేవ్‌గణ్‌, అక్షయ్‌ కుమార్‌, షారుక్‌ ఖాన్‌ కలిసి ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ చేశారు. దీంతో విమల్ గ్యాంగ్ అంటూ నెటిజన్లు ఈ యాడ్ ని, ఆ హీరోలని ట్రోల్ చేస్తున్నారు. అయితే అక్షయ్ మీద చాలా మందికి సాఫ్ట్ కార్నర్ ఉంది. దీంతో అక్షయ్ ఇలా షారుఖ్, అజయ్ లతో కలిసి పాన్ మసాలా యాడ్ లో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయి అసహనం వ్యక్తం చేశారు. అక్షయ్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి యాడ్ ఎందుకు ఒప్పుకున్నావ్ అక్షయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను నేను ఎప్పటికి ప్రమోట్‌ చేయనని చెప్పి ఇప్పుడు డబ్బుల కోసం చేశాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.