Allu Arjun Daring Step For Pushpa 2
Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా, ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే ఊరమాస్ పాత్రలో పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దీనికి అన్ని భాషల్లోలోనూ స్టన్నింగ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు పుష్ప-2 కోసం చిత్ర యూనిట్ అప్పుడే పనులను ప్రారంభించింది.
Pushpa 2: సుక్కూ చెక్కుడు.. పుష్పరాజ్ రాకకు ఇంకాస్త టైమ్ పడుతుందా?
పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప-2 చిత్రం బాక్సాఫీస్ వద్ద మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 సినిమా కోసం బన్నీ ఓ డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నాడట. అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోయే పుష్ప-2 సినిమా కోసం బన్నీ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోబోడట. అయితే దానికి బదులుగా ఈ సినిమాకు హిందీలో వచ్చే వసూళ్లల్లో షేర్ తీసుకుంటాడని తెలుస్తోంది.
పుష్ప సినిమాకు బాలీవుడ్ జనం పట్టం కట్టారు. దీంతో పుష్ప సీక్వెల్ చిత్రం కోసం అక్కడి వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీన్ని బట్టి అక్కడ ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది గమనించిన బన్నీ, పుష్ప2 హిందీ మార్కెట్‌లో సెన్సేషనల్ కలెక్షన్స్ రాబడుతుందని.. అందుకు ఈ సనిమాకు అక్కడ వచ్చే కలెక్షన్స్‌లో కొంత షేర్ తీసుకుంటాడని తెలుస్తోంది. మరి నిజంగానే బన్నీ ఈ డేరింగ్ స్టెప్ తీసుకుంటాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Pushpa: ఇదెక్కడి మాస్ మావా.. పుష్ప పార్ట్ 3 కూడానా?
ఇక పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోయే ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ పాత్రలో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. ఆయన సరసన ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నారు. త్వరలోనే పట్టాలెక్కనున్న పుష్ప2 చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.