Pushpa: ఇదెక్కడి మాస్ మావా.. పుష్ప పార్ట్ 3 కూడానా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప - ది రైజ్’ ఇటీవల రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.....

Pushpa: ఇదెక్కడి మాస్ మావా.. పుష్ప పార్ట్ 3 కూడానా?

Pushpa Part 3 Also To Be Made By Sukumar

Updated On : March 25, 2022 / 8:49 PM IST

Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప – ది రైజ్’ ఇటీవల రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో బన్నీ ఓ ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, పుష్పకు అన్ని భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

Pushpa2: పుష్పతో ఐటెం సాంగ్.. ఊ అనేస్తున్న బాలీవుడ్ భామలు!

ఈ సినిమాకు వచ్చిన భారీ రెస్పాన్స్‌తో ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఇప్పటికే స్క్రిప్టు పనుల్లో దర్శకుడు సుకుమార్ బిజీగా ఉన్నాడు. కాగా ఈ సినిమాలోనూ సేమ్ క్యాస్టింగ్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే కొందరిని మాత్రం కొత్తగా తీసుకుంటారట. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా పుష్ప చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Sukumar: రాజమౌళి సార్.. అంటూ RRRపై సుక్కు కామెంట్!

అందరూ అనుకుంటున్నట్లు పుష్ప చిత్రం కేవలం రెండు భాగాలు మాత్రమే కాదట.. ఈ సినిమా ఇంకా ఉందని తెలుస్తోంది. పుష్పా పార్ట్ 3 కూడా ఉంటుందని.. దీనికి సంబంధించిన కథ కూడా రెడీ అయ్యిందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేగాక దీనికి సంబంధించిన కథను కూడా సుకుమార్ రెడీ చేశాడని.. బన్నీకి కూడా ఈ కథ నచ్చడంతో పార్ట్ 3కి ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తతో మరోసారి పుష్ప చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే పుష్ప చిత్ర యూనిట్ నుండి ఎవరైనా క్లారిటీ ఇవ్వాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక పుష్ప చిత్రంలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటించగా, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.