‘గో లోక‌ల్ బీ వోక‌ల్’.. అల్లు శిరీష్ కొత్త స్లోగన్..

‘గో లోక‌ల్ బీ వోక‌ల్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో అల్లు శిరీష్ సరికొత్త ఉద్య‌మాని నాంది పలికిన అల్లు శిరీష్..

  • Published By: sekhar ,Published On : June 18, 2020 / 08:50 AM IST
‘గో లోక‌ల్ బీ వోక‌ల్’.. అల్లు శిరీష్ కొత్త స్లోగన్..

‘గో లోక‌ల్ బీ వోక‌ల్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో అల్లు శిరీష్ సరికొత్త ఉద్య‌మాని నాంది పలికిన అల్లు శిరీష్..

యంగ్ హీరో అల్లు శిరీష్ సరికొత్త ఉద్య‌మానికి నాంది ప‌లికారు. ‘గో లోక‌ల్ బీ వోక‌ల్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో శిరీష్ మొద‌లుపెట్టిన ఈ ఉద్య‌మం ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతుంది. ప్రతి భారతీయుడు కుదిరినంత వరకు విదేశీ బ్రాండ్ల వాడకాన్ని తగ్గించాలి. మన వద్ద ప్రత్యామ్నాయం లేకపోతేనే అది కూడా స్వ‌దేశీయేతర ఉత్పత్తులనే వాడాలి.

అంతేగాని ప్ర‌తి అవ‌స‌రానికి విదేశి ఉత్పత్తలు వాడకూడదని అల్లు శిరీష్ పిలుపునిచ్చారు. అంతేకాదు తానే స్వ‌యంగా మార్కెట్‌కి వెళ్లి ఏరికోరి భారతీయ బ్రాండ్లను వెతికి మ‌రీ కొన్నారు. వీలైనంత వరకు అందరూ ఇలాగే చేయండి అంటూ తాను కొన్న భారతీయ ఉత్పత్తుల ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

అలానే చాలా మంది స్వ‌దేశీ వస్తువుల‌ను ఉప‌యోగిస్తున్నాస‌రే బ‌య‌ట‌కి చెప్ప‌రు, ఇక పై అలా కాకుండా మ‌నం స్వ‌దేశీ ఉత్ప‌త్తుల‌ను వాడుతున్నాము అని స‌గ‌ర‌్వంగా బ‌య‌ట‌కి వెల్ల‌డించాల‌ని  అల్లు శిరీష్ అన్నారు. శిరీష్ ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి సినిమాకి సంబంధించిన ప‌నుల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌ణ‌తో పాటు కీల‌క విష‌యాలు త్వరలో తెలియనున్నాయి.