Gangster : జైలు నుంచి గ్యాంగ్‌స్టర్ రిలీజ్.. అంతలోనే మళ్లీ కటకటాల్లోకి.. అసలేం జరిగిందంటే?

Gangster : ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. అంతే.. ఆ గ్యాంగ్‌స్టర్ తిరిగి కటకటాల్లోకి వెళ్లిపోయాడు.

Gangster : జైలు నుంచి గ్యాంగ్‌స్టర్ రిలీజ్.. అంతలోనే మళ్లీ కటకటాల్లోకి.. అసలేం జరిగిందంటే?

Gangster, Out Of Jail, Holds ( Image Source : Google/Screenshot video)

Updated On : July 26, 2024 / 9:25 PM IST

Gangster : జైలు నుంచి అప్పుడే రిలీజ్ అయ్యాడు.. అంతలోనే మళ్లీ అదే జైల్లోకి పంపేశారు పోలీసులు. ఒక గ్యాంగ్‌స్టర్ ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే, అతడు బయటకు వచ్చానే ఆనందంలో సంబరాలు చేస్తూ అభిమానులు, ఫాలోవర్లు భారీ ర్యాలీని నిర్వహించారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. అంతే.. ఆ గ్యాంగ్‌స్టర్ తిరిగి కటకటాల్లోకి వెళ్లిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

Read Also : Viral Video: విడాకులు వచ్చాయోచ్ అంటూ పార్టీ ఇచ్చి అదిరిపోయే స్టెప్పులు వేసిన యువతి

అసలేం జరిగిందంటే? :
మహారాష్ట్రలోని నాసిక్‌లోని గ్యాంగ్‌స్టర్ హర్షద్ పాటంకర్‌పై మురికివాడలు, బూట్‌లెగర్లు, డ్రగ్ నేరస్థులు, ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం (MPDA) కింద జైలు శిక్ష పడింది. ఈ నెల 23న జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతని అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని రోడ్డుపై కారు ర్యాలీ చేపట్టారు. బేతేల్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో దాదాపు 15 ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి.

వైరల్ వీడియోలలో కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు పాటంకర్ తన అభిమానుల వైపు అభివాదం చేయడం చూడవచ్చు. అతని అనుచరులంతా  “కమ్ బ్యాక్” అనే క్యాప్షన్‌తో ర్యాలీ రీల్స్‌ను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. అయితే ఆ రీల్స్ కాస్తా.. పోలీసుల దృష్టికి వెళ్లింది.

అనుమతి లేకుండా అనధికారిక ర్యాలీని నిర్వహించి గందరగోళం సృష్టించినందుకు పాటంకర్‌తో పాటు అతని 6 అనుచరులను పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. నివేదికల ప్రకారం.. గ్యాంగ్ స్టర్ హర్షద్‌పై హత్యాయత్నం, దొంగతనం, హింసతో సహా అనేక పోలీసు కేసులు నమోదయ్యాయి.

Read Also : School Van Driver : ప్రాణాలను వదిలే ముందు.. 20 మంది పిల్లల్ని కాపాడిన స్కూల్ వ్యాన్ డ్రైవర్!