×
Ad

Allu Ramalingayya : అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరించిన వారసులు..

ఆయన జయంతిని పురస్కరించుకొని అల్లు స్టూడియోస్ ఆవరణలో అల్లు రామలింగయ్య గారి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆయన మనవళ్లు

  • Published On : October 1, 2021 / 10:41 AM IST

Allu

Allu Ramalingayya :  ఒకప్పటి సినిమాల్లో కామెడీకి నిర్వచనం అల్లు రామలింగయ్య. ఎన్నో సినిమాల్లో ఆయన తన అద్భుతమైన హాస్య నటనతో మన అందర్నీ అలరించారు. సినీ పరిశ్రమకి ఎంతో సేవ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. ఆయన తర్వాత కూడా ఆయన కుమారుడు అల్లు అరవింద్ నిర్మాతగా ఎన్నో సినిమాలని నిర్మిస్తున్నారు. ఆయన మనవళ్లు అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇప్పటికే హీరోలుగా సెటిల్ అయ్యారు. అల్లు బాబీ నిర్మాతగా స్థిరపడ్డారు. ఇటీవలే ఈ కుటుంబం అల్లు స్టూడియోస్ కూడా నిర్మించారు. ఇవాళ స్వర్గీయ పద్మశ్రీ శ్రీ అల్లు రామలింగయ్య గారి జయంతి.

Mahesh Babu : మ్యాగజైన్ కోసం మహేష్ నమ్రత ఫోటోషూట్

ఆయన జయంతిని పురస్కరించుకొని అల్లు స్టూడియోస్ ఆవరణలో అల్లు రామలింగయ్య గారి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆయన మనవళ్లు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లు స్టూడియోస్ సిబ్బంది అంతా పాల్గొన్నారు. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన తాతయ్యని స్మరించుకుంటూ ఆయన మా అందరికి మార్గ నిర్దేశకుడు అని పోస్ట్ చేశారు.