Anchor Syamala : మహిళ ఫిర్యాదుతో యాంకర్ శ్యామల భర్త అరెస్ట్..

పాపులర్ యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.. తన దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఆయనపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది..

Anchor Syamala : మహిళ ఫిర్యాదుతో యాంకర్ శ్యామల భర్త అరెస్ట్..

Anchor Syamala

Updated On : April 27, 2021 / 3:47 PM IST

Anchor Syamala: యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.. తన దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఆయనపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది.. 2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా డబ్బు తీసుకునట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. డబ్బుల విషయం అడిగితే తనను బెదిరిస్తున్నాడని తెలిపింది.

డబ్బులు తీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకు సైతం పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇదే విషయంపై సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ నరసింహా రెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపినట్లుగా తెలిపింది.

దీంతో నరసింహా రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేసి, అతనితో పాటు రాయబారం నడిపిన మహిళను రిమాండ్‌కి తరలించారు రాయదుర్గం పోలీసులు.. కాగా నరసింహా రెడ్డి పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు.. యాంకర్ శ్యామలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..