Asaduddin Owaisi: ఆ ఎంపీ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: అసదుద్దీన్

‘‘దేశంలోని చట్టాల ప్రకారమే నుపుర్ శర్మను అరెస్టు చేయాలి. చట్ట ప్రకారమే ఆమెను శిక్షించాలి. ఈ విషయంలో ఇదే మా పార్టీ వైఖరి. పార్టీలోని నేతలు అందరూ దీన్ని అంగీకరించాలి. ఇంతియాజ్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు’’ అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

Asaduddin Owaisi: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో నుపుర్ శర్మను ఉరితీయాలన్న సొంత ఎంపీ అభిప్రాయంతో తమ పార్టీకి సంబంధం లేదన్నాడు ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఏఐఎమ్ఐఎమ్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ గత శుక్రవారం నుపుర్ శర్మను ఉరితీయాలంటూ వ్యాఖ్యానించాడు. ‘‘నుపుర్ శర్మను ఉరితీయాలి. ఆమెను అలాగే స్వేచ్ఛగా వదిలేస్తే అలాంటి ఘటనలు జరగడాన్ని ఆపలేం’’ అని ఇంతియాజ్ అన్నాడు.

Chemical Blast: కెమికల్ బ్లాస్ట్.. ఒకరు మృతి

దీంతో ఇంతియాజ్‌పై బీజేపీతోపాటు పలు పార్టీలకు చెందిన నేతలు మండిపడ్డారు. ఈ అంశం వివాదాస్పదం కావడంతో ఆ పార్టీ అధినేత ఒవైసీ స్పందించారు. ‘‘దేశంలోని చట్టాల ప్రకారమే నుపుర్ శర్మను అరెస్టు చేయాలి. చట్ట ప్రకారమే ఆమెను శిక్షించాలి. ఈ విషయంలో ఇదే మా పార్టీ వైఖరి. పార్టీలోని నేతలు అందరూ దీన్ని అంగీకరించాలి. ఇంతియాజ్ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు’’ అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మరోవైపు ఇంతియాజ్ వ్యాఖ్యలను శివసేన కూడా ఖండించింది. ఆ పార్టీ నాయకురాలు, ఎంపీ ప్రియాంకా చతుర్వేది మాట్లాడుతూ ‘‘ఇంతియాజ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. వీటిని ఖండించాలి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిగా ఇలాంటి సందర్భంలో రెచ్చగొట్టే బదులు శాంతియుతంగా, సంయమనంతో ఉండాల్సింది’’ అని ప్రియాంకా చతుర్వేది ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Chhattisgarh Boy: 40 గంటలుగా బోరుబావిలో బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మరోవైపు నుపుర్ శర్మకు మద్దతుగా ‘ఉమెన్ ప్రైడ్ ప్రొటెక్షన్ కమిటీ’ అనే మహిళా సంఘం ఆధ్వర్యంలో అహ్మదాబాద్‌లో ఆదివారం ర్యాలీ జరగనుంది. ఈ సందర్భంగా ఈ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘నుపుర్ శర్మ వ్యాఖ్యలు కొందరి మనోభావాలు దెబ్బతీసి ఉండొచ్చు. ఈ విషయంలో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉద్దేశపూర్వకంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేయలేదు. బాధ్యతగల పౌరులుగా ఈ విషయాన్ని చట్టానికే వదిలేయాలి’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు