Chemical Blast: కెమికల్ బ్లాస్ట్.. ఒకరు మృతి

Chemical Blast
Chemical Blast: అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిగూడ గోల్ మసీదు వెనుక గల మొగరం బస్తీలో ఆదివారం కెమికల్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మ్యాన్‌హోల్‌లో కెమికల్ వేసి నీళ్లు పోస్తుండగా ఒకేసారి పెద్ద బ్లాస్ట్ జరిగింది. దీంతో భరత్ బాతోడ్ అనే వ్యక్తి మరణించాడు. గోపాల్ బాతోడ్ అనే వ్యక్తి గాయపడ్డారు. వీళ్లలిద్దరూ తండ్రీకొడుకులు అని పోలీసులు తెలిపారు. ఘటనలో కొడుకు మరణించగా, తండ్రి గాయాలపాలయ్యాడు. క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.