Chhattisgarh Boy: 40 గంటలుగా బోరుబావిలో బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ఛత్తీస్‌ఘఢ్‌లోని జంజ్‌గిర్ జిల్లా పిహ్రిద్ గ్రామంలో బోరుబావిలో పడిపోయిన బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాలుడిని బయటకు తీసేందుకు దాదాపు 40 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Chhattisgarh Boy: 40 గంటలుగా బోరుబావిలో బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Chhattisgarh Boy

Chhattisgarh Boy: ఛత్తీస్‌ఘఢ్‌లోని జంజ్‌గిర్ జిల్లా పిహ్రిద్ గ్రామంలో బోరుబావిలో పడిపోయిన బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాలుడిని బయటకు తీసేందుకు దాదాపు 40 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం రాహుల్ సాహు అనే బాలుడు తన ఇంటి వెనుక గల, పాత బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది బాలుడిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ కలిసి సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

National Herald Case: ఈడీ ఆఫీసుల ముందు రేపు కాంగ్రెస్ నిరసన

బాలుడు పడిపోయిన బావి దాదాపు 80 అడుగుల వరకు ఉంటుందని అంచనా. ఇప్పటివరకు 50 అడుగులకు పైగా గొయ్యి తవ్వడం పూర్తైంది. 60-65 అడుగుల వరకు గొయ్యి తవ్వడం పూర్తైన తర్వాత బాలుడు ఉన్న ప్రదేశానికి సమాంతరంగా సొరంగం తవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని చత్తీస్‌ఘడ్ సీఎం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం బాలుడు ఉన్న ప్రదేశానికి గొయ్యి తవ్వేందుకు మరో 12 గంటలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోబోటిక్ టెక్నాలజీని కూడా బాలుడిని రక్షించేందుకు వినియోగిస్తున్నారు.