National Herald Case: ఈడీ ఆఫీసుల ముందు రేపు కాంగ్రెస్ నిరసన

రేపు (సోమవారం) దేశవ్యాప్తంగా ఉన్న 25 ఈడీ ఆఫీసుల ఎదుట నిరనసలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రతిపక్షాలను అదుపులో ఉంచుకునే లక్ష్యంతో ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

National Herald Case: ఈడీ ఆఫీసుల ముందు రేపు కాంగ్రెస్ నిరసన

National Herald Case

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను తమ ఎదుట హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు చేపట్టేందుకు సిద్ధమైంది.

Prayagraj Clash: ప్రయాగ్‌రాజ్ హింస.. నిందితుడి ఇంటి కూల్చివేతకు సిద్దం

రేపు (సోమవారం) దేశవ్యాప్తంగా ఉన్న 25 ఈడీ ఆఫీసుల ఎదుట నిరనసలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రతిపక్షాలను అదుపులో ఉంచుకునే లక్ష్యంతో ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆదివారం కూడా ఈ అంశంపై నిరసన తెలియజేసేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించనున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాహుల్ గాంధీ ఈడీ ఎదుట రేపు హాజరుకావాల్సి ఉంది. సోనియా గాంధీ కరోనా వల్ల హాజరుకాలేనని తెలిపింది. దీంతో సోనియా గాంధీ ఈ నెల 23న హాజరు కావాలని ఈడీ తాజా సమన్లు జారీ చేసింది. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట సోమవారం టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నారు.

COVID-19: వరుసగా రెండోరోజు ఎనిమిది వేలు దాటి కరోనా కేసులు

పెద్దమ్మతల్లి దేవాలయం నుంచి ఈడీ ఆఫీసు వరకు పాదయాత్ర చేపట్టి, తమ నిరసన తెలియజేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీ-నెహ్రూ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలని మోదీ, అమిత్ షా ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కాగా, సోమవారం ఈడీ జరిపే విచారణకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశాలున్నాయి. నిజానికి రాహుల్ గాంధీ ఈ నెల 2నే హాజరు కావాలి. కానీ, ఆయన విదేశాల్లో ఉండటంతో హాజరు కాలేదు.