COVID-19: వరుసగా రెండోరోజు ఎనిమిది వేలు దాటి కరోనా కేసులు

ఇప్పటివరకు మొత్తం దేశంలో 43,222,017 కరోనా కేసులు నమోదుకాగా, 524,761 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.11 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 195 కోట్ల వ్యాక్సినేషన్ కూడా పూర్తైంది.

COVID-19: వరుసగా రెండోరోజు ఎనిమిది వేలు దాటి కరోనా కేసులు

Covid 19

COVID-19: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత వారం రోజుల క్రితం వరకు రోజుకు రెండు వేలకే పరిమితమైన కరోనా కేసులు ఇప్పుడు ఎనిమిది వేలకు చేరుకున్నాయి. శనివారం ఒక్కరోజే 8,582 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది వేల కేసులు దాటడం ఇది వరుసగా రెండో రోజు. శనివారం నలుగురు మరణించారు. ఇప్పటివరకు మొత్తం దేశంలో 43,222,017 కరోనా కేసులు నమోదుకాగా, 524,761 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.11 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 195 కోట్ల వ్యాక్సినేషన్ కూడా పూర్తైంది. మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 2,922 కేసులు నమోదయ్యాయి.

IPL: నేడే ఐపీఎల్ ప్రసార హక్కుల ఇ-వేలం

ఒక్కరు మరణించారు. ఢిల్లీలో 795, కర్ణాటకలో 562, చత్తీస్‌ఘడ్‌లో 27, ఒడిశాలో 24 కేసులు నమోదయ్యాయి. ఈ వారం దాదాపు 20 వేల కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ నాలుగో వేవ్ వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. కేసుల పెరుగుదల నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కోవిడ్ నిబంధనల్ని అమలు చేస్తున్నాయి.