Babu Mohan : పవన్, పోసాని ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు.. బాబు మోహన్ ఫైర్
ప్రస్తుతం బాబు మోహన్ 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ తరఫున ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో
- Saketh U
- Published On : October 2, 2021 / 06:58 AM IST
Babumohan
Babu Mohan : రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ సినీ కష్టాల గురించి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ ని విమర్శించారు. ఇది అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత జనసేన నాయకులు పోసానిపై విరుచుకుపడటం, పోసాని మళ్ళీ ఫైర్ అవ్వటం, పవన్ అభిమానులు పోసాని ఇంటిపై దాడి చేయటం… ఇలా రోజు రోజుకి ఈ గొడవ పెద్దదవుతుంది. ఈ ఇష్యూ పై సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు బాబు మోహన్ కూడా ఈ విషయం పై స్పందించారు.
ప్రస్తుతం బాబు మోహన్ ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ తరఫున ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇరు ప్యానల్స్ ప్రెస్ మీట్స్ పెడుతూ ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడటంతో ప్రకాష్ రాజ్ వ్యతిరేక ప్యానెల్ పెట్టే ప్రెస్ మీట్స్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ పై కూడా స్పందిస్తూ విమర్శిస్తున్నారు.
తాజాగా మంచు విష్ణు ప్యానల్ తరుపున జరిగిన ప్రెస్ మీట్ లో బాబు మోహన్ మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ సహకారం ఇండస్ట్రీకి అవసరం. పవన్ కళ్యాణ్, పోసాని ఇద్దరూ కూడా ఇండస్ట్రీ పరువు పోకుండా వ్యవహరించి ఉండాల్సింది అని అన్నారు. ఏపీ ప్రభుత్వం దగ్గరకు సినీ పెద్దలు పరిశ్రమలో ఉన్న సమస్యల్ని తీసుకెళ్లారు. ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందిస్తుంది. ఈ లోపే ఇలా మాట్లాడటం సరి కాదు అని పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఏదైనా సమస్య ఉంటే సినీ పెద్దలతో కూర్చొని మనమే పరిష్కరించుకొవాలి కానీ ఇలా వ్యక్తిగత దూషణలకు పోవడం వల్ల ఇండస్ట్రీ పరువు పోతుందని ఆయన అన్నారు.
