Pawan Kalyan : మంచు విష్ణు సినిమా బ‌డ్జెట్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా మార్నింగ్ షో క‌లెక్ష‌న్స్ అంత కూడా ఉండదు..

విష్ణు నేను ఇండ‌స్ట్రీ వైపు ఉన్నానా? లేక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌వైపు ఉన్నానా? అని ప్ర‌శ్నించారు. అలా ప్ర‌శ్నించ‌డం ఏమీ బాగోలేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇండ‌స్ట్రీ మ‌నిషి కాడా? ప‌వ‌న్ ఇండ‌స్ట్రీ

Pawan Kalyan :  మంచు విష్ణు సినిమా బ‌డ్జెట్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా మార్నింగ్ షో క‌లెక్ష‌న్స్ అంత కూడా ఉండదు..

Pk

Pawan Kalyan :  మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా) ఎన్నిక‌ల ప్రచారం రోజు రోజుకి వేడి ఎక్కుతుంది. అక్టోబ‌ర్ 10న ఈ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఎలక్షన్స్ దగ్గరకి వస్తున్న తరుణంలో ప్ర‌కాశ్ రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్స్ ప్రెస్ మీట్స్ పెట్టి ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా ఎలక్షన్స్ లో భాగమైంది.

మొన్న మంచు విష్ణు ప్యానల్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సీనియర్ నటుడు న‌రేశ్ మాట్లాడుతూ ప్రకాశ్‌రాజ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తాజాగా ప్ర‌కాశ్‌రాజ్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విమర్శలపై స్పందించారు. విష్ణు నేను ఇండ‌స్ట్రీ వైపు ఉన్నానా? లేక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌వైపు ఉన్నానా? అని ప్ర‌శ్నించారు. అలా ప్ర‌శ్నించ‌డం ఏమీ బాగోలేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇండ‌స్ట్రీ మ‌నిషి కాడా? ప‌వ‌న్ ఇండ‌స్ట్రీ కష్టాల గురించి మాట్లాడాడు అది తప్పా?? ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముందు ఇండ‌స్ట్రీ మ‌నిషి త‌ర్వాతే రాజ‌కీయ నాయ‌కుడు. మంచు విష్ణు నోరు అదుపులో పెట్టుకోవాలి. మంచు విష్ణు సినిమా బ‌డ్జెట్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా మార్నింగ్ షో క‌లెక్ష‌న్స్ అంత ఉండ‌దు. నాకు, ప‌వ‌న్‌కు సిద్ధాంత ప‌రంగా బేదాభిప్రాయాలున్నాయి. కానీ సినిమా విష‌యానికి వ‌స్తే నేను నంద‌, ఆయ‌న బ‌ద్రి అని ఘాటుగా స్పందించారు.

BiggBoss : బిగ్ బాస్ లోకి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్

ఈ ఎన్నిల‌కు, జ‌గ‌న్‌కు సంబంధ‌మేంటి మా ఎన్నికల్లోకి రాజకీయాల్ని ఎందుకు తీసుకొస్తున్నారు అని ప్రశ్నించారు. మంచు విష్ణు తన మ్యానిఫెస్టో చూసి చిరంజీవి, పవన్ తనకే ఓటు వేస్తారన్నారు. మరి నా మ్యానిఫెస్టో చూసి మోహన్ బాబు నాకు ఓటేస్తారా? అని అడిగారు. ఇత‌ర భాషా న‌టులు ‘మా’ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం గురించి నరేశ్ మాట్లాడటంపై కూడా ప్ర‌కాశ్ రాజ్ వ్యతిరేకించారు. నేను కర్ణాటకలో పుట్టాను. తమిళ్ ,కన్నడ, తెలుగులో నటుడిగా ఎన్నో సంవత్సరాలుగా చేసాను. అందుకు నేను ‘మా’ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌నే నియమం ఉందా? తెలుగు భాష‌లో నేను ఏ స్థాయిలో అయినా మాట్లాడ‌గ‌ల‌ను. తెలుగు మాట్లాడితే తెలుగు వారు అయిపోరు అంటూ చురకలు అంటించారు. తిల‌క్‌, చ‌లం, ఆత్రేయ వంటి వారి గురించి నేను కూడా మాట్లాడ‌గ‌ల‌ను. వ్యాక‌ర‌ణం, చంద‌స్సు, అలంకారాలు గురించి కూడా నేను మాట్లాడ‌గ‌ల‌ను అంటూ తీవ్రంగా స్పందించారు.