BiggBoss : బిగ్ బాస్ లోకి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్

 బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత ఎక్కువగా మీడియాలో వినిపించిన పేరు రియా చక్రవర్తి. సుశాంత్ ప్రియురాలిగా ఈమె చాలా రోజులు వార్తల్లో నిలిచింది. తెలుగు, హిందీ

BiggBoss : బిగ్ బాస్ లోకి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్

Riya

BiggBoss :  బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత ఎక్కువగా మీడియాలో వినిపించిన పేరు రియా చక్రవర్తి. సుశాంత్ ప్రియురాలిగా ఈమె చాలా రోజులు వార్తల్లో నిలిచింది. తెలుగు, హిందీ భాష‌ల‌్లో కొన్ని సినిమాలలో హీరోయిన్ గా రియా నటించింది. సుశాంత్ మరణం తర్వాత ఆ కేసులో నిందితురాలిగా ఉంది. తర్వాత బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా నిందితురాలిగా ఉండి నెల రోజుల జైలు జీవితం కూడా గడిపింది. తర్వాత బెయిల్ పై విడుదల అయింది.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తనకి సినిమా ఆఫ‌ర్స్ రావడం కష్టమని అర్ధమయింది. తన లైఫ్ ని మళ్ళీ కొత్తగా ప్రారంభించాలి అని చూస్తుంది. సినిమా కుదరకపోతే తనకి గుర్తింపు వచ్చేలా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తుంది. ఈ తరుణంలోనే రియాకి హిందీ బిగ్ బాస్ నుంచి రాబోయే సీజన్ కి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఇందుకోసం రియాకి భారీ పారితోషకమే ఆఫర్ చేసినట్టు సమాచారం. రియా కొద్ది రోజులుగా వార్తల్లో, వివాదాల్లో ఉంది కాబట్టి తనని తీసుకొస్తే టిఆర్పి ఎక్కువగా వస్తుంది అని షో నిర్వాహకులు భావించారు. ఇందుకోసం ఆమెకు వారానికి 30 లక్షల పారితోషకం కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం.

Siri Hanumanth : పెళ్లి కాకుండానే తల్లి అయ్యాను అని చెప్పిన బిగ్ బాస్ కంటెస్టెంట్

కానీ బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీ ఉంటుంది. అసలే ఇన్నాళ్లు వివాదాల్లో ఉండి మెల్లగా ఇప్పుడిప్పుడే బయటకి వస్తుంది. అందుకే బిగ్ బాస్ కి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకి ఎటువంటి ఆఫర్స్ లేవు, డబ్బులు కూడా లేకపోవడంతో వచ్చిన ఛాన్స్ ని వదులుకుంటే మళ్ళీ ఏ ఛాన్స్ రాదేమో అని ఆలోచనతో బిగ్ బాస్ కి ఓకే చెప్తుంది అని సన్నిహిత వర్గాలు అనుకుంటున్నాయి. అదే నిజమైతే ఈ సారి హిందీ బిగ్ బాస్ కి బాగానే రేటింగ్ వచ్చి షోకి ప్లస్ అవుతుంది.