తండ్రైన ఉసేన్ బోల్ట్

మనిషి రూపంలో మరో చిరుతగా..పేరొందిన ఉసేన్ బోల్ట్..తండ్రి అయ్యాడు. బోల్ట్ భాగస్వామి..కాసీ బెన్నెట్ కింగ్ స్టన్ లోని ఓ ఆసుపత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈ వార్త వైరల్ అయ్యింది. ఆడబిడ్డకు జన్మనిచ్చిన స్ర్పింట్ దిగ్గజం..ఉసేన్ బోల్ట్ – కాసి బెన్నెట్ జంటకు శుభాకాంక్షలు..ఆయన ట్వీట్ చేశారు. తమకు ఆడబిడ్డ జన్మించబోతున్నట్లు గత మార్చిలోనే బోల్ట్..సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
100మీ పరుగులో దశాబ్దకాలం పాటు ఉసేన్ బోల్ట్ తిరుగులేని రికార్డ్‌లు నెలకొల్పాడు. దాదాపుగా అన్ని ఈవెంట్లలో బంగారు పథకాలను సాధించాడు. చిట్ట చివరి పరుగును కాంస్యంతో ముగించాడు. IAAFప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ షిప్స్ లో బోల్ట్ చివరిసారిగా పాల్గొన్నారు. 2017లో రిటైర్ అయ్యాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు ఈ హీరో. 2008, 2012, 2016 ఒలింపిక్స్ క్రీడల్లో 100, 200 మీటర్లలో పసిడి పతకాలు గెలిచిన ఈ ఘనత సాధించి చరిత్ర నెలకొల్పాడు బోల్ట్.