మట్టిలో మయూరి : పల్లె పడుచు డ్యాన్స్‌కు మాధురీ దీక్షిత్ ఫిదా

మట్టిలో మయూరి : పల్లె పడుచు డ్యాన్స్‌కు మాధురీ దీక్షిత్ ఫిదా

Updated On : February 9, 2021 / 4:22 PM IST

Madhuri dixits high praise  Villege girl dancing : బాలీవుడ్ మాధురీ దీక్షిత్. అందానికి అభినయానికి..సూపర్ డ్యాన్స్ కు కేరాఫ్ అడ్రస్. కళ్లతో ఆమె పలికించే భావాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అటువంటి మాధురీదీక్షిత్ ఓ సాధారణ పల్లెటూరి బాలిక వేసిన డ్యాన్స్ కు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాధిరీ దీక్షిత్ ఓ పల్లెటూరి బాలిక వేసిన డ్యాన్స్ సూపర్ గా ఉంది. ఆమెలో అసామాన్య ప్రతిభ ఉంది అంటూ ప్రశంసలు కురిపించారు.

ఏక్ దో తీన్.., చోలీ కే పీచే.., ద‌క్ ధ‌క్ క‌ర్నే ల‌గా.., మార్ దాలా లాంటి సాంగ్స్‌తో సినీ ప్రేక్ష‌కుల‌ని ఓ ఊపు ఊ..అభినందంతోను నృత్యంతోను తన అందాలతో మెస్మరైజ్ చేసిన మాధురీ దీక్షిత్. ఓ పల్లెపడుచు డ్యాన్స్ ను మెచ్చుకోవటమంటే ఆమె వేసిన డ్యాన్స్ ఏంటో తెలుసుకోవాల్సిందే. చూడాల్సిందే. ఫేస్ లో ఎక్స్‌ప్రెష‌న్స్ చూపిస్తూ అద్భుత‌మైన స్టెప్పులు వేసిన మాధురీ దీక్షిత్ కొన్నాళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

మాధురీ దీక్షిత్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. త‌న సినిమాలోని పాట‌లే కాదు వేరే స్టార్స్ సినిమా పాట‌ల‌కు అద్భుతంగా డ్యాన్స్ చేసినా చక్కగా స్పందిస్తారు. ఇక రాజేంద్ర కుమార్, కుమ్‌కుమ్ న‌టించిన ‘‘గూగ‌ట్ న‌హీ కోలూన్ సైయా తోరే ఆజా’’ అనే పాట‌కు ఓ విలేజ్ గార్ల్ వేసిన అద్భుత‌మైన డ్యాన్స్ కు మాధురీ ఫిదా అయిపోయారు.

ఈ డ్యాన్స్ వీడియో మాధురి దీక్షిత్‌ను బాగా ఆకట్టుకుంది. ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆ అమ్మాయి అద్భుతంగా డ్యాన్స్ చేసింది. చాలా టాలెంట్ ఆమెలో దాగుంది ఆమెలో అంటూ ప్రశంసించారు మాధురీ దీక్షిత్..ఈ వీడియోలో ఓ బాలిక ఎర్రటి జాకెట్లు, నీలం రంగు స్కర్ట్ వేసుకుని పచ్చని పొలాల మధ్య గట్టుమీద బుట్టబొమ్మలా తిరుగుతూ వేసి డ్యాన్స్ చూస్తే మట్టిలో దాగున్న మయూరి అనిపిస్తుంది.