Shirdi temple
Shirdi temple : ఎంతో ప్రసిద్ధి చెందిన షిర్డీ ఆలయానికి (shirdi temple) చెందిన శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కి (shri saibaba sansthan trust) ఇప్పుడొక సమస్య వచ్చింది. ట్రస్ట్ ఖాతాలు ఉన్న ప్రభుత్వ బ్యాంకులు ట్రస్ట్ నుంచి నాణాలు తీసుకోవడానికి నిరాకరించడంతో షిర్డీ ఆలయ ట్రస్ట్ ఇప్పుడు RBI ని ఆశ్రయించింది.
No Entry For Women In Temple : ఆ ఊరిలో వింత ఆచారం.. ఆ గుడిలోకి ఆడవాళ్లకు నో ఎంట్రీ, ఎందుకో తెలుసా
శ్రీసాయిబాబా ట్రస్ట్ కి 13 ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. షిర్డీలోనే 12 ఖాతాలుండగా.. నాసిక్ లో ఒకటి ఉంది. అయితే వీటిలో నాలుగు బ్యాంకులు ఇప్పుడు నాణాలు స్వీకరించడానికి నిరాకరిస్తున్నాయి. స్థలాభావం కారణంగా విరాళాలుగా వచ్చిన నాణాలు స్వీకరించలేమని తెలిపాయి. కాగా షిర్డీ సాయిబాబా ట్రస్ట్ కు నాణాల రూపంలో లక్షల రూపాయలు విరాళాలుగా అందుతున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకుల్లో 11 కోట్ల రూపాయల మేరకు నాణాల రూపంలో డిపాజిట్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆలయానికి సంబంధించి నాణాల రూపంలోనే ఎక్కువగా విరాళాలు వస్తున్నందున జోక్యం చేసుకోవాల్సిందిగా ట్రస్ట్ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. ఈ విషయాన్ని ట్రస్ట్ సీఈవో రాహుల్ జాదవ్ వెల్లడించారు.
ఇక ఈ విషయంగా అహ్మద్‌నగర్ (ahmednagar) జిల్లాలోని కొన్ని బ్యాంకుల్ని కూడా సంప్రదించి అవి అంగీకరిస్తే ట్రస్ట్ ఖాతాలు అక్కడ తెరవాలని అనుకుంటున్నట్లు రాహుల్ జాదవ్ చెబుతున్నారు. మరి వీరి సమస్యకు RBI కూడా ఎలా స్పందిస్తుందో చూడాలి.