Snake On Shiva Lingam : ఆలయంలో వింత.. శివలింగం చుట్టూ పాము ప్రదక్షిణలు, గర్భగుడిలో గంటకుపైగా శివలింగంపైనే..

ఓ పాము శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఆ తర్వాత శివలింగంపై పడగ విప్పి నిలబడింది. గంటకు పైగా శివలింగాన్ని స్పృశిస్తూ ఉండిపోయింది.

Snake On Shiva Lingam : ఆలయంలో వింత.. శివలింగం చుట్టూ పాము ప్రదక్షిణలు, గర్భగుడిలో గంటకుపైగా శివలింగంపైనే..

Updated On : November 27, 2022 / 6:20 PM IST

Snake On Shiva Lingam : ఓ పాము శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఆ తర్వాత శివలింగంపై పడగ విప్పి నిలబడింది. గంటకు పైగా శివలింగాన్ని స్పృశిస్తూ ఉండిపోయింది.

కామారెడ్డి జిల్లా దోమకొండలోని సుబ్రమణ్యం ఆలయంలో జరిగిందీ ఘటన. ఉదయం ఆలయం తలుపులు తీయగానే గర్బగుడిలో శివలింగంపై పాము కనిపించింది. గంటకు పైగా గర్భగుడిలోనే తిరుగుతూ శివలింగంపై చాలాసేపు అలానే ఉండిపోయింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. తర్వాత ఆలయ అర్చకులు పాముని పట్టే వ్యక్తిని పిలిపించి దాన్ని పట్టించారు. ఊరి చివరన విడిచిపెట్టారు.

Snake On Shiva Lingam

దోమకొండ మండలం లింగుపల్లి శివారులో సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ఉంది. పాము.. లింగమూర్తిని చుట్టుకొని అక్కడే ఉండిపోయిన విషయం తెలిసి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీనిపై స్పందించిన భక్తులు.. ఇది దైవ మహిమే అని అభిప్రాయపడ్డారు.

Also Read : Baby girl-tail: తోకతో జన్మించి అందరినీ ఆశ్చర్యపర్చిన పాప.. చివరకు..

భూమిని, ప్రకృతిని దైవంగా కొలిచే సంస్కృతి మనది. పశు పక్షాదులు, జంతువులు.. ఇలా సమస్త జీవరాశిలో దైవాన్ని చూస్తాం. ఆవునే కాదు విషపూరితమైన నాగుపామును కూడా పూజిస్తాం. నాగుపాముని దైవంగా భావించి నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసి.. భక్తిభావంతో వాటిని మొక్కుతాం. శివుడి మెడలో కంఠాభరణంగా నాగుపాము, విష్ణువు పాన్పుగా ఆదిశేషు ఇలా పాముల గురించి పురాణాల్లో రకరకాల కథలు ప్రస్తావనలో ఉన్నాయి. ఇక అప్పుడప్పుడు పాములు ఆలయంలో దేవతా విగ్రహాల దగ్గర దర్శినమిచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో ఇదంతా దైవ మహిమే అని భక్తులు విశ్వసిస్తున్నారు.

Also Read : Tamil Nadu: పాముకు పూజలు చేస్తుండగా నాలుకపై కాటేసిన పాము.. భక్తుడి నాలుక కోసేసిన పూజారి