‘కల నెరవేరింది’.. చిరు ఫ్యామిలీతో సోహైల్..

‘కల నెరవేరింది’.. చిరు ఫ్యామిలీతో సోహైల్..

Updated On : January 22, 2021 / 6:44 PM IST

Bigg Boss Sohel: బిగ్ బాస్ సీజ‌న్ 4లో తనదైన స్టైల్‌లో గేమ్ ఆడుతూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సయ్యద్ సోహైల్.. టైటిల్ విన్ అవకపోయినా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు.. హౌస్ నుండి బయటకొచ్చిన తర్వాత అతని క్రేజ్ ఏంటో అందరికీ తెలిసింది. ఇటీవల సోహైల్ హీరోగా సినిమా కూడా ప్రారంభమైంది.

Sohel

ఇదిలా ఉంటే తాజాగా సోహైల్ కల నెరవేరింది. మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా ఆయన నివాసంలో కలిసి ఆశీస్సులందుకున్నాడు.. చిరంజీవితో పాటు ఆయన తల్లి అంజనా దేవి, శ్రీమతి సురేఖలతో ఫొటోలు తీసుకున్నాడు. చిరు, అంజనా దేవిలతో సెల్ఫీలు తీసుకుని మరీ సంబరపడిపోయాడు. చిరంజీవిని కలవడం, మాట్లాడడంతో తన కల నెరవేరిందని తెగ హ్యీపీగా ఫీలయిపోతున్నాడు సోహైల్.

Sohel

Sohel