BiggBoss 6 Day 76 : గీతూ పోయింది.. ఆదిరెడ్డి వంతు.. ఆదిరెడ్డిపై ఫైర్ అయినా నాగార్జున..

 బిగ్‌బాస్ హౌజ్ లో గేమ్ రసవత్తరంగా సాగుతుంది. మరి కొన్ని వారాల్లో బిగ్‌బాస్ అయిపోతుండటంతో అందరూ సీరియస్ గానే ఆడుతున్నారు. ఇటీవల ఆదిరెడ్డి అతితెలివి ప్రదర్శిస్తున్నాడు. గతంలో గీతూ బిగ్‌బాస్ మాట కూడా వినకుండా...........

BiggBoss 6 Day 76 : గీతూ పోయింది.. ఆదిరెడ్డి వంతు.. ఆదిరెడ్డిపై ఫైర్ అయినా నాగార్జున..

BiggBoss 6 Day 76 nagarjuna fires on adireddy

BiggBoss 6 Day 76 :  బిగ్‌బాస్ హౌజ్ లో గేమ్ రసవత్తరంగా సాగుతుంది. మరి కొన్ని వారాల్లో బిగ్‌బాస్ అయిపోతుండటంతో అందరూ సీరియస్ గానే ఆడుతున్నారు. ఇటీవల ఆదిరెడ్డి అతితెలివి ప్రదర్శిస్తున్నాడు. గతంలో గీతూ బిగ్‌బాస్ మాట కూడా వినకుండా ఇష్టం వచ్చినట్టు ఉండేది. ఇప్పుడు ఆదిరెడ్డి కూడా అలాగే చేస్తున్నాడు. గత ఎపిసోడ్స్ లో ఇమ్యూనిటీ దక్కించుకునే గేమ్‌ ఇచ్చినప్పుడు ఇదంతా అనవసరం అన్నాడు. అలాగే ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కోసం టాస్క్ ఇచ్చినప్పుడు కూడా నేను ఆడను, నాకు అవసరం లేదని సిల్లీగా తీసిపడేశాడు. గేమ్స్ లో అతితెలివి ప్రదర్శించాడు. దీంతో అంతా గీతూలాగే ఓవరాక్షన్ చేస్తున్నాడు అని కౌంటర్లు వేస్తున్నారు.

ఇక వీకెండ్ ఎపిసోడ్ అవడంతో నాగార్జున వచ్చి కొంతమందికి క్లాస్ పీకాడు. ముఖ్యంగా అందరికంటే ముందు ఆదిరెడ్డిపై ఫైర్ అయ్యాడు. నాగార్జున ఆదిరెడ్డిని ఉద్దేశించి.. బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు ఆడకుండా అనవసర కారణాలు చెప్తున్నావు. నువ్వు ఆ టాస్క్ ఆడి ఎవిక్షన్ పాస్ గెలిచి ఉంటే జెన్యూన్ గా ఆడవాళ్ళని ఆపగలిగేవాడివి కదా, అప్పుడు ప్రేక్షకులు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ గేమ్ ఆడకుండా ఓ మూలాన కూర్చున్నావు. ఎవిక్షన్ పాస్ వేస్ట్ అన్నావు. నీకు గేమ్ గురించి తెలుసా? నువ్వేమన్నా తోపా? నువ్వు ఆడటానికి వచ్చావు, కానీ ఆడకుండా పక్కన వాళ్ళని మాటలతో మాయ చేస్తున్నావు. ఇలాగే ఎక్కువ చేస్తే గీతూలాగే నువ్వు కూడా వెళ్ళిపోతావు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. దీంతో ఆదిరెడ్డి సైలెంట్ అయిపోయాడు.

అలాగే శ్రీహాన్ కి కూడా వార్నింగ్ ఇచ్చాడు నాగ్. శ్రీసత్యని ఒకలాగా, మిగిలిన కంటెస్టెంట్స్ ని ఒకలాగా చూస్తున్నావు. తను నీకు ఫ్రెండ్ అయితే బయట చూసుకో ఇక్కడ హౌజ్ లో కాదు అని వార్నింగ్ ఇచ్చాడు. చివరగా కంటెస్టెంట్స్ కి మీమ్స్ గేమ్ అని పెట్టాడు నాగ్. కొన్ని పాపులర్ మీమ్ కౌంటర్ నేమ్స్ కార్డులు అక్కడ ఉంచి ఒక్కొక్కరిని ఒక్కో కార్డు ఎవరికి ఏది సూట్ అవుతుందో వాళ్ళకి ఇమ్మన్నాడు నాగ్.

BiggBoss 6 Day 70 : ఆదివారం మరో ఎలిమినేషన్ తో షాక్ ఇచ్చిన నాగ్..

రేవంత్‌కు.. ‘ఇవే తగ్గించుకుంటే మంచిది’ అని ఆదిరెడ్డి ఇచ్చాడు.
శ్రీసత్యకు ‘ఓరి.. దీని వేషాలూ’ అన్న మీమ్‌ ఇచ్చాడు శ్రీహాన్‌.
రాజ్‌ కు.. ‘ఓన్లీ వన్స్‌ ఫసక్‌’ ఇచ్చింది ఫైమా.
ఫైమాకు.. ‘అట్లుంటది మనతోని’ ట్యాగ్‌ ఇచ్చాడు రాజ్‌.
శ్రీహాన్‌కు.. ‘సరె సర్లే, చాలా చూశాం’ అనే ట్యాగ్‌ ఇచ్చింది కీర్తి.
శ్రీహాన్ కు.. ‘వీడెవడు ఓవరాక్షన్‌ చేస్తున్నాడు.. చైల్డ్‌ ఆర్టిస్టా?’ అన్న మీమ్‌ను ఇచ్చింది ఇనయా.
శ్రీహాన్ కు.. ‘మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌రా నీలో, ఆట్‌.. కమల్‌ హాసన్‌’ అని అన్నాడు రోహిత్.
శ్రీహన్ కు.. ‘చాలా ఉన్నాయ్‌ దాచాం.. లోపల కుప్పలు కుప్పలుగా ఉన్నాయ్‌’ అన్న మీమ్‌ను ఇచ్చింది శ్రీసత్య.
రేవంత్ కి.. ‘ఇదేందయ్యా ఇది, నేనేడా చూడలా’ అన్న మీమ్‌ ఇచ్చింది మెరీనా.
ఆదిరెడ్డికి ‘పని అయిపాయే’ అని ఇచ్చాడు రేవంత్‌. ఎక్కువగా అందరూ శ్రీహాన్ ని టార్గెట్ చేశారు. మరి ఈ ఆదివారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.