BiggBoss 6 Day 78 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరున్నారంటే..?
బిగ్‌బాస్ చివరి స్టేజికి వచ్చేయడంతో గేమ్ రసవత్తరంగా సాగుతుంది. ఆదివారం నాటి ఎపిసోడ్ లో జంటని విడదీసి మెరీనాని ఎలిమినేట్ చేశాడు బిగ్‌బాస్. ఇక సోమవారం నాడు ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే ఈ సారి ఎప్పటిలాగే మొహం మీద తిట్టుకోకుండా.........

BiggBoss 6 Day 78 nominations week
BiggBoss 6 Day 78 : బిగ్‌బాస్ చివరి స్టేజికి వచ్చేయడంతో గేమ్ రసవత్తరంగా సాగుతుంది. ఆదివారం నాటి ఎపిసోడ్ లో జంటని విడదీసి మెరీనాని ఎలిమినేట్ చేశాడు బిగ్‌బాస్. ఇక సోమవారం నాడు ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే ఈ సారి ఎప్పటిలాగే మొహం మీద తిట్టుకోకుండా, కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిని రూమ్ లోకి పిలిచి ఎవరినైతే నామినేట్ చేయాలనుకున్నారో వారి ఫోటోని ముక్కలు చేయమన్నాడు. దీంతో ఈ సారి నామినేషన్స్ లో గొడవలు జరగలేదు. కానీ నామినేట్ చేయడానికి రీజన్స్ మాత్రం చెప్పించాడు బిగ్‌బాస్.
దీంతో ఈ వారం నామినేషన్స్ లో రోహిత్.. శ్రీహాన్, ఫైమాలని, శ్రీసత్య.. రాజ్, రోహిత్ లని, రాజ్.. శ్రీహాన్, శ్రీసత్యలని, కీర్తి.. శ్రీహాన్, శ్రీసత్యలని, ఫైమా.. రోహిత్, ఇనయాలని, శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డిలని, ఇనయ.. ఫైమా, రాజ్ లని, ఆదిరెడ్డి.. ఇనయా, శ్రీహాన్ లని, రేవంత్.. ఫైమా, ఆదిరెడ్డిలని నామినేట్ చేశారు. ఈ వారం నామినేషన్స్ నుంచి రేవంత్ బయటపడ్డాడు.
BiggBoss 6 Day 77 : జంటని విడదీసిన బిగ్‌బాస్.. ఈ వారం ఎలిమినేషన్ పూర్తి..
మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లో శ్రీహాన్, ఫైమా,రోహిత్, రాజ్, ఆదిరెడ్డి, శ్రీసత్య, ఇనయాలు ఉన్నట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఇక రేవంత్ తో ఇంటి సభ్యులంతా మళ్ళీ గొడవలు పెట్టుకున్నారు. రేషన్ మేనేజర్ కూడా తానే అవ్వడంతో ఇంతే వండాలి, ఇంతే తినాలి అని రూల్స్ చెప్పడంతో అందరూ సీరియస్ అయ్యారు. ఫుడ్ దగ్గర రూల్స్ ఏంటి అని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో అందరూ రేవంత్ ని విమర్శించారు.