Smart Mask : స్మార్ట్ మాస్క్..ఇతరులు దగ్గరకొస్తే..ముక్కూ,నోరు కప్పేస్తుంది

ఇప్పటి వరకు ఎన్నో రకాల మాస్కులు చూశాం. కానీ స్కూల్ విద్యార్ధులు తయారు చేసిన మాస్క్ మాత్రం వెరీ డిఫరెంట్.. ఇతరులు దగ్గరకొస్తే ఆటోమేటిక్ గా..

Smart Mask : ఇప్పటి వరకు ఎన్నో రకాల మాస్కులు చూశాం. బంగారం, వజ్రాలతో తయారు చేసిన మాస్కులు చూసి..శ్రీమంతుల దర్పాలు ఇలాగే ఉంటాయని ఆశ్చర్యపోయాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే మాస్క్ మాత్రం చాలా వెరైటీ. మాస్కులందు మా స్మార్ట్ మాస్క్ వేరయా అన్నట్లుగా ఉంటదీ మాస్కు..ఇంతకీ ఈ మాస్కులో ఉన్న ప్రత్యేకతలేమిటంటే…

Read more : మాస్క్ మహారాజ్: రూ.11 కోట్లతో మాస్క్ తయారు చేయించుకుంటున్న వ్యాపారి…

ఈ మాస్క్ ధరించిన వ్యక్తికి దగ్గరకు అంటే..ఎవరన్నా రెండు అడుగుల దగ్గరకు వస్తే..ఈ మాస్క్ ఆటోమేటిక్ గా రియాక్ట్ అవుతుంది. వెంటనే ధరించిన వ్యక్తి ముక్కు..నోరు కవర్ చేసేస్తుంది. అంటే మనం సర్ధుకోనవసరం లేకుండానే దానికదే ముక్కు..నోటిని కవర్ చేసేస్తుంది. ఈ వినూత్న మాస్క్ ను బీహార్ కు చెందిన విద్యార్ధులు రూపొందించారు.

బీహార్ రాజధాని పాట్నాకు చెందిన జ్ఞాన్ నికేతన్ స్కూల్ విద్యార్ధులు తెలివితేటలకు ఈ ఆటోమేటిక్ మాస్క్ నిదర్శనంగా కనిపిస్తోంది. శషాంక్ దేవ్, ప్రత్యూష్ శర్మ అనే ఫిజిక్స్ టీచర్ సహకారంతో విద్యార్ధులు ఆటోమేటిక్ సెన్సర్ ను ఉపయోగించి ఈ మాస్కును తయారు చేశారు. మనిషి శరీర ఉష్ణోగ్రత కారణంగా ప్రసారమయ్యే ఆల్ట్రాసోనిక్ సౌండ్ ఆధారంగా ఆ స్మార్మ్ మాస్క్ పనిచేస్తుంది.

Read more : variety Face Mask: నెట్టింట్లో రచ్చ చేస్తున్న మాస్క్ ..!!

ఈ సౌండ్ ను వేవ్ రిసీవర్ గ్రహించి, మాస్కు కిందకు, పైకి వెళ్లేలా చేస్తుంది. దీన్ని తయారు చేయటానికి రూ.670 ఖర్చు అయ్యిందని చెబుతున్నారు విద్యార్ధులు. అదే ఎక్కువగా తయారు చేస్తే మరింత ఖర్చు తగ్గుతుందని కేవలం రూ.100కే ఇటువంటి మాస్కులు తయారు చేయవచ్చని చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు