variety Face Mask: నెట్టింట్లో రచ్చ చేస్తున్న మాస్క్ ..!!

ఓ వ్యక్తి పెట్టుకున్న మాస్క్ నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ప్రవత్తిరీత్యా సౌకర్యం కోసం కోసమని ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఈ మాస్క్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..

variety Face Mask: నెట్టింట్లో రచ్చ చేస్తున్న మాస్క్ ..!!

Coconut Face Mask

variety Face Mask : కరోనా. రోజు రోజుకూ కొత్త వేరియంట్లు పుట్టుకువస్తోంది. మళ్లీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళన పెంచుతున్నాయి. రక్షణ కోసం ధరించే ఫేస్‌మాస్క్‌‌ ల్లో వింతైనవి..చిత్ర విచిత్రమైనవి ఎన్నో ఉన్నాయి. వెరైటీ ఫేస్ మాస్కులు పెట్టుకుని వైరల్ అయినవారు ఎందరో ఉన్నారు. అటువంటిదే మరో వెరైటీ ఫేస్ మాస్కుతో జనాలకే కాదు పోలీసులకు కూడా షాక్‌ ఇచ్చోడో వ్యక్తి. ఇంతకీ ఏంటా వెరైటీ మాస్క్..?

Indonesian man runs into trouble with cops for wearing coconut face mask - Culture

ఇండోనేషియాకు చెందిన నంగా బుడియాసా..అనే వ్యక్తి అలాంటి మాస్క్‌నే తయారుచేసుకున్నాడు. ఈ మాస్క్ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ మాస్క్‌ను ఏ వస్త్రంతోనో చేస్తే పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ దాన్ని కొబ్బరి చిప్పతో తయారు చేయటం విశేషం.ఇండోనేషియాకు చెందిన నంగా బుడియాసా అనే వ్యక్తి ఒక పార్కింగ్ స్థలంలో పనిచేస్తున్నాడు. పార్కింగ్ ప్లేస్ లో విజిల్స్ వేయటం సర్వసాధారణం.

Indonesian man runs into trouble with cops for wearing coconut face mask - Culture

వాహనదారులకు సూచనలివ్వటానికి తరచు విజిల్ వేయాల్సి ఉంటుంది. దాని కోసం అతను మళ్లీ మళ్లీ మాస్క్ తీయాల్సి వచ్చేది. అలా అస్తమాను మాస్కు తీయటం..విజిల్స్ వేయటం మళ్లీ మాస్క్ పెట్టుకోవటమే పనిగా మారింది. దీంతో అతనికి విసుగు వచ్చేది.దీంతో ఓ సరికొత్త ఐడియా వేశాడు. అదే కోకోనట్ మాస్క్.

read more : Herbal Face Mask : వావ్..బాబాగారి హెర్బల్ మాస్క్…ధరిస్తే.. కరోనా ఆమడదూరం పారిపోతుందట..

వెంటనే కొబ్బరి చిప్పతో ప్రయోగం చేశాడు. సరికొత్త మాస్క్‌ని సృష్టించాడు.కొబ్బరి చిప్పకు రెండు చివరలా చెవులకు పెట్టుకునేలా రబ్బరు దారాలను పెట్టాడు. అలాగే శ్వాస ఆడటానికి కొబ్బరి చిప్పకు చిన్న రంద్రం చేసి..దానికి విజిల్‌ను ఫిక్స్ చేశాడు. విజిల్ వేయటానికి అస్తమాను మాస్క్ తీయాల్సిన పనిలేకుండా.ఈ కోకోనట్ మాస్క్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. కొబ్బరిచిప్ప మాస్క్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు.

read more : Mask paint : మాస్క్ లాగా పెయింట్ వేసుకుని యువతి ఓవర్ యాక్షన్..పాస్ పోర్ట్ సీజ్ చేసిన అధికారులు!

కానీ పాపం ఆ కొబ్బరి చిప్ప మాస్క్ నంగాకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.ఈ మాస్క్ వైరల్ కావటంతో ఈ విషయం కాస్తా పోలీసులకు తెలియటంతో నంగాకు పోలీసులు థమ్కీ ఇచ్చారు. కరోనా మార్గదర్శకాల ప్రకారమే మాస్కు పెట్టుకోవాలని చెప్పారు. ఆ మాస్క్ తీసేసి..కరోనా నుంచి రక్షణనిచ్చే మాస్క్ ధరించాలని సూచించారు.

Coconut Face Mask

కానీ పాపం నంగా తన పరిస్థితి పోలీసులకు వెళ్లబోసుకున్నాడు. తరచు మాస్క్ తీసి విజిల్ వేసి మళ్లీ మాస్క్ పెట్టుకోవటం ఇబ్బందిగా ఉందని..అందుకే కొబ్బరి చిప్ప మాస్క్ తయారు చేసుకున్నానని పోలీసులకు నంగా వివరణ ఇచ్చుకున్నాడు. అయినా పోలీసులు ఊరుకోలేదు. మరోసారి ఈ మాస్క్ పెట్టుకుంటే ఫైన్ వేస్తామని హెచ్చరించారు. కానీ ఏది ఏమైనా నంగాకు వచ్చిన ఈ వెరైటీ ఆలోచన భలేగుందంటున్నారు నెటిజన్లు.

 

See also..